‘అంతఃపురం’ లో ఏం జరుగుతోంది? ‘ప్రగతి కోట’ రహస్యం!!

‘ప్రగతి భవన్’ అంతః పుర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉష్ణోగ్రతలు 60 డిగ్రీలు దాటినా అవి బయటకు కనిపించకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం ఇప్పట్లో ఆగకపోవచ్చు.ప్రస్తుతం అల్పపీడనంగా బయటకు కనిపిస్తున్నా వాయుగుండంగా మారే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేము. ”రాజకీయాల నుండి తప్పుకుంటే బాగుంటుందేమో”నన్న వ్యాఖ్యల వెనక ఎలాంటి ఉద్దేశం లేదని మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు. ప్రజాభిమానానికి చలించి భావోద్వేగానికి లోనై చేసిన వ్యాఖ్యలు మాత్రమేనన్నారు. ”జోరు వానలో గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలకడంతో భావోద్వేగానికి లోనయ్యానని,గ్రామస్థుల అభిమానం చూసి ఇంతకంటే మరేం కావాలి అనిపించింద”ని చెప్పారు. భావోద్వేగంలో చేసిన వ్యాఖ్యలు తప్పా మరేం కాదన్నారు. టిఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యం లేదనడం దుష్ప్రచారంగా ఆయన కొట్టివేశారు. హరీష్ రావు లేని టిఆర్ఎస్ ను చూడాలని కేటీఆర్’కరసేవకులు’ భావిస్తుండవచ్చునన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది. హరీశ్ రావు కోసం తాము తలుపులు ఎల్లవేళలా తెరచి ఉంచినట్టు కాంగ్రెస్, బిజెపి నాయకులు ఓ వైపు చెబుతున్నారు. కానీ హరీశ్ రావు అంతరంగంలో ఏమున్నదో తెలుసుకోవడం కష్టం. తన పుట్టుక – చావు టిఆర్ఎస్ లోనే అని హరీశ్ రావు లక్ష సార్లు చెప్పినా, కేసీఆర్ పట్ల విధేయతను చాటుకోవడానికి ఎన్ని తిప్పలు పడినా ఆయనపై ‘అనుమానపు చూపులు’ కొనసాగుతున్నవి. హరీష్ రావు తనకు తానుగా పార్టీని వదలివెళ్ళరని ఆయన మాటల్ని బట్టి, ప్రదర్శిస్తున్న విధేయతను బట్టి అర్ధమవుతున్నది. ఇప్పుడేం చేయాలి? బయటకు పంపడమెలా? అనే దిశగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయా! అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది. హరీష్ రావు సిద్ధిపేటకు పరిమితమైన నాయకుడు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు పరిమితమైన నాయకుడు కాదు. తెలంగాణ వ్యాప్తంగా పరిచయమైన మనిషి. తెలంగాణ అంతటా ‘ఫాలోయింగ్’ ఉన్న నాయకుడు అని కేసీఆర్ కు బాగా తెలుసు. హరీశ్ రావును సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం చేయడం ద్వారా, అధికారపార్టీ పత్రికలో వార్తలు నిషేధించడం ద్వారా, లేదా ఆ పత్రిక జిల్లా పేజీల్లో కూడా మరీ లోపలి పేజీల్లోనూ వార్తలు ప్రచురించడం ద్వారా, టిఆర్ఎస్ శ్రేణులకు, ప్రజలకు ఏ సందేశం పంపించదలచుకున్నట్టు?

ఎస్.కె.జకీర్.
అధికారం, అభద్రత రెండూ విడదీయరానివి. అధికారం ఉన్న చోటే ‘అభద్రత’ ఉంటుంది. దుర్వినియోగమూ ఉంటుంది. అధికారమే లేకపోతే అభద్రత ఎందుకు? అధికారమే లేకపోతే అధికార దుర్వినియోగం ఎలా సాధ్యం? గట్టి పోటీదారు ఉన్నప్పుడు ‘అభద్రత’ సహజం. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు ఇలాంటి చర్చకు దారితీస్తున్నవి.” కేటీఆర్ క్యాబినెట్ లో పని చేయడానికి నాకు ఎలాంటి మొహమాటం, అభ్యంతరం లేవు” అని మంత్రి హరీష్ రావు చాలా స్పష్టంగా, నిజాయితీగా, క్రమశిక్షణ కల కార్యకర్తగా ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూ లో కుండబద్దలుకొట్టినట్టుగా చెప్పుకున్నారు. ”ఇంకా ఆయన పట్ల అనుమానాలెందుకు! ఇంకా అణచివేత ఏమిటి! ఇంకా కట్టడి ఏమిటి ! ఇంకా నియంత్రణలు ఎందుకు! ఇంకా నిఘా ఏమిటి?” టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో, హరీష్ రావు మద్దతుదారుల్లో జరుగుతున్న చర్చ ఇది.కేసీఆర్’అంతః పురం’లో ఏం జరుగుతోంది ? ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో ఏమి జరుగుతున్నది? మొత్తం మీద ఏదో జరుగుతున్నది.ఏంజరుగుతున్నదో తెలియదు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు పార్టీలో,ప్రభుత్వంలో ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయింది. కొంగరకలాన్ సభ, అసెంబ్లీ రద్దు తర్వాత ప్రభుత్వమూ, పార్టీ…. రెండింటిపైనా కూడా తారక రామారావు ‘పట్టు’ బిగించారు. పట్టు బిగించే అన్ని మార్గాలను ఆయన తండ్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తెరిచారని టిఆర్ఎస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా కేటిఆర్ ను ‘తయారు చేసే’ పనిలో కేసీఆర్ ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. ఈ మేరకు కొన్ని ప్రముఖ దినపత్రికల్లోవార్తాకథనాలు ఇదివరకే వచ్చాయి. సమయం కొద్దిగా అటూ, ఇటూ కావచ్చు.

అసెంబ్లీ ఫలితాల వెల్లడి వెనుకే ‘కుమార పట్టాభిషేకం’ జరగవచ్చు, లేదా లోక్ సభ ఎన్నికల తర్వాత ‘ఆ ఘట్టం’ చోటు చేసుకోవచ్చు. కనుక కేటీఆర్ ఇష్టపడని వాళ్ళను, ఆయనకు ప్రధాన ‘పోటీదారు’ కావచ్చుననుకుంటున్న హరీశ్ ను డిల్లీకి పంపించే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అసలు సిద్ధిపేట అసెంబ్లీ టికెట్టుకే ఎసరు పెడతారంటూ బిజెపి నాయకుడు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్య కలకలం రేపుతున్నది. రఘునందన్ రావుకు దీనిపై పక్కా సమాచారం ఉన్నదీ, లేనిదీ ఎవరికీ తెలియదు.ఒక వేళ అది నిజమైతే ఆ సమాచారం ఆయనకు ఎలా చేరిందో తెలియవలసి ఉన్నది.సిద్ధిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని రఘునందనరావు చెప్పడం ఆశ్చర్యం కలిగించే అంశం. 105 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా సంగతి తన మంత్రివర్గ సహచరులకే తెలియకుండా కేసీఆర్ ప్రకటించి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. అలాంటిది హరీష్ ‘బి-ఫామ్ కు గండం’ ఉందని రఘునందనరావు జోస్యం ఎలా చెప్పగలిగారు ? మరో వైపు అధికార పార్టీకి చెందిన దినపత్రికలో, టివి ఛానళ్లలో హరీష్ రావు వార్తలను ‘నిషేదించినట్టు’ జరుగుతున్న ప్రచారం దావానలం వలె వ్యాపించింది.శనివారం ఆయన మార్కెటింగ్ వ్యవహారాలపై నిర్వహించిన సమీక్ష వార్త ఆదివారం నాటి ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కనిపించలేదు. అంతకు ముందు ఆయన సిద్ధిపేట జిల్లా ఇబ్రాహీంపూర్ గ్రామంలో ‘భావోద్వేగం’తో చేసిన రాజకీయ సన్యాసం వ్యాఖ్యలు కాదుకదా, కనీసం ఆ కార్యక్రమం వార్తను ప్రముఖంగా ప్రచురించలేదు. ఇబ్రాహీం పూర్ గ్రామం యావత్తు టిఆర్ఎస్ కు ఓటు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తే అది టిఆర్ఎస్ అధికార పత్రికకు వార్త కాకుండా ఎందుకు పోయింది? సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గంలో హరీశ్ప్రచారం సాగించిన వార్త మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ లో మెయిన్ పేజీలలో లేదు. సీఎం పక్షాన జరిపిన ప్రచారం కూడా ఆ పత్రికలో వార్తగా ఎందుకు రాలేదో ప్రజలకు, టిఆర్ఎస్ శ్రేణులకుఅర్ధమవుతూనే ఉన్నది. టిఆర్ఎస్ మౌత్ పీస్ గా భావించే పత్రికలో మంత్రి హరీశ్ పై ‘నిషేధం’ ఏమిటి ? అంటే అర్థమేమిటి? టిఆర్ఎస్ నాయకులకు, క్యాడర్ కు ఏమి మెసేజ్ ను కేసీఆర్ ‘పరివారం’ ఇవ్వదలచుకున్నట్టు? రాజకీయాల్లో నేరుగా ఎవరూ ఏమీ చెప్పరు. పరిస్థితులు, పరిణామాలే భవిష్యత్తుకు దిక్సూచిగా భావించాలి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ నాయకత్వం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు సిఫారసు చేసి రెండు నెలలు గడచిపోయినవి. అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పై కూడా ఇలాంటి తీర్మానం పెండింగులో ఉన్నది. ఈ లోగా భూపతిరెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయినందున ఇక ఆయనపై ఫిర్యాదుకు కాలం చెల్లింది. డి.ఎస్. పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉన్నది. కేసీఆర్ సస్పెండ్ చేస్తారని పార్టీ నాయకులు భావించడం లేదు. ఆయనంతట ఆయనే పార్టీని విడిచి వెళ్లాలని కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. హరీశ్ ఎపిసోడ్ కూడా అంతే. ఆయనను పంపిస్తున్నట్టు చెప్పరు. తానే స్వయంగా వెళ్లిపోయే విధంగా ప్రయత్నాలేవో బలంగా , పకడ్బందీగా జరుగుతున్నట్టు ‘ఒక ప్రత్యేక వాతావరణం’, కనబడని సంక్షోభం ఏదో అంతటా అలుముకున్నది. తెలంగాణ రాష్ట్ర సమితికి నారు, నీరు పోసి ఉద్యమం ఫలించి రాష్ట్రం సిద్ధించేదాకా హరీశ్ కృషి, నిబద్దత,అంకితభావం విషయంలో ఎలాంటి వివాదం లేదు. మంత్రిగా ఆయన పనితీరుపై కేసీఆర్ స్వయంగా పలుమార్లు ప్రశంసించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, మజ్లీస్,బిజెపి, లెఫ్ట్ పార్టీల నాయకులు కూడా హరీశ్ నాయకత్వ పటిమ, సామర్థ్యాన్ని శంకించలేరు. కెసీఆర్ కుటుంబంలో ‘కలతలు’ ఏర్పడినట్టు జరుగుతున్న ప్రచారానికి ఆధారాలు లేవు కానీ హరీశ్ కు వ్యతిరేకంగా ‘కూటమి’ ఏర్పడినట్టు తాజా పరిణామాలు, సంఘటనలు సూచిస్తున్నట్టు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకోవడానికి , లేదా పార్టీలో చీలిక రాకుండా నివారించేందుకు మాత్రమే ఎన్నికలు ‘ముందస్తు’ గా తీసుకు వచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తునే ఉన్నారు. ఆ ఆరోపణల్లో నిజమెంత ఉన్నదో కేసీఆర్ కుటుంబ సభ్యులకే తెలియాలి.తెలంగాణలో ముందస్తు ఎన్నికల అవసరమేమిటో వివరించడంలో, ప్రజల్ని, పార్టీ శ్రేణులను కన్విన్సు చేయడంలో పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు ‘అతకడం’ లేదన్న వాదన ఉన్నది.

అరవై యేళ్ళ కల సాకారమై తెలంగాణ రాష్ట్రం అవతరించినపుడు తొలి ప్రభుత్వం పూర్తికాలం అయిదేళ్ల పాటు నిలవలేదన్నఅపవాదును కేసీఆర్ సొంతం చేసుకోవలసి వచ్చింది. ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దారుణంగా విఫలమైంది. మొత్తంమీద ఉరుములు, మెరుపులు కనిపిస్తున్నవి. తుపాను సంకేతాలపై ఇంకా స్పష్టత రావలసి ఉన్నది. అయితే ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా,ఎన్ని అవమానాలను భరించవలసి వచ్చినా మేనమామను ధిక్కరించరాదని హరీశ్ రావు భావిస్తున్నట్టు ఆయన పత్రికలూ, టివిచానళ్లకుఇస్తున్నవివిధ ఇంటర్వ్యూ ల ద్వారా మనకు అర్ధమవుతున్నది. ఇక అసెంబ్లీ ముందస్తు ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల అసమ్మతి బద్దలైంది. వివిధ రాజకీయపార్టీల నుంచి వచ్చి చేరిన నాయకుల మధ్య సమన్వయం శూన్యం. సమన్వయం చేసే నాయకులు లేరు.ప్రతి జిల్లాలో, ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ రెండు మూడు గ్రూపులుగా పార్టీ ముక్కలు చెక్కలై ఉన్నది.కింది స్థాయి కార్యకర్తలలో, ప్రజాప్రతినిధులలో సంతృప్తి లేదు. ”రెండో టర్మ్ మాదే” అని కేసీఆర్ ఎంతో ధీమా కనబరుస్తున్నప్పటికీ అది మేకపోతు గాంభీర్యం అనే అనుమానాలు వచ్చే విధంగా కూడా ఆయన మాటలు,చేతల వల్ల అర్ధమవుతుందని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. .తమ సుపరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉంటే, ‘పాజిటివ్’ ఓటుకు డోకా లేదనుకుంటే రైతులకు రెండు పంటలకు కలిపి 8 వేల రూపాయలు, గర్భిణీలకు కేసీఆర్ కిట్స్ వంటి పలు జనాకర్శక పథకాలను సంధించవలసిన అవసరం లేదని చెబుతున్నారు.”నదీ ప్రవాహం… వొడ్డునుకోసేస్తూ విస్తరించినట్టు, శత్రువులను కూడా క్రమ క్రమంగా బలహీన పరచాలి..దెబ్బ తెలియకూడదు,గాయం మానకూడదు.” అన్నది కెసిఆర్ పాలసీ అని పార్టీ సీనియర్ కార్యకర్తలంటున్నారు. గత ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాల్లో టిఆర్ ఎస్ అతి కష్టం మీద చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా 63 స్థానాలు గెలుచుకోగలిగింది.తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకు వచ్చిన చాంపియన్ గా ప్రజల్లోకి వెళ్ళినా బొటాబొటీ సీట్లు ఎందుకోచ్చాయో కెసిఆర్ విశ్లేషించుకోవడం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఎమోషన్లు లేవు. తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నది. గత ఎన్నికల్లో 63 సీట్లు గెలిచిన టి ఆర్ ఎస్ తర్వాత ఉపఎన్నికల్లో మరో రెండు గెలిచి 65 కు సంఖ్యాబలం పెంచుకున్నది.వివిధ పార్టీల నుంచి వచ్చిన శాసన సభ్యులు 25 మందిని కలుపుకుంటే టిఆరెస్ఎం.ఎల్.ఏ.ల సంఖ్య 90 కి చేరుకున్నది.’తెలంగాణ ప్రజలకు లాజిక్ అవసరం లేదని మ్యాజిక్కుకావాల’ని కెసిఆర్ బలంగా నమ్ముతున్నట్టు వినిపిస్తున్నది . అధికారంలో ఉన్నందున వాపు కన్పించవచ్చు గానీ అది బలం కాదని గ్రామ స్థాయి టిఆర్ ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కెసిఆర్ ఏకఛత్రాధిపత్యం వల్ల వాతావరణం ఒక ఊపులాకన్పిస్తున్నా చివర వరకు వచ్చే సరికి అది ఒక పొంగులా చల్లారే ప్రమాదం కూడా లేకపోలేదు.కెసిఆర్ వ్యవహార శైలిపట్ల పార్టీలో,ప్రభుత్వంలోనూ అయిష్టత వ్యక్తం చేసే వారు లేకపోలేదు. పార్టీలో దిగువ శ్రేణి రాజకీయ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అధికారులకు ప్రాధాన్యత నివ్వడం, పూర్వాపరాలు, పర్యవసానాల గురించి ఎవరితో చర్చించకుండా తాను అనుకున్న నిర్ణయాలను మొండిగా అమలు చేయడం, వివిధ వ్యవస్థల్లో తనను ప్రశ్నించేవారు లేకుండా చూసుకోవడం, ఎవరినైనానయానాభయానాలొంగదీసుకోవడం కెసిఆర్ నైజం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క‌ష్టించిప‌ని చేసే త‌త్వం ఉన్న వాళ్లు ఎప్పుడూ విశ్రాంతి గురించి ఆలోచించరు. తాము చేసే ప‌నిలోనిమ‌గ్న‌మైపోతారు. ఆక‌లి, నిద్ర‌, ఇత‌రదైనందినకార్య‌కలాపాలు కూడా వారి ప‌నిలో భాగంగానే ఉంటాయి. ప్ర‌జాసేవేవ్యాప‌కంగా సాగిపోతుంటారు. ల‌క్ష్యం కోసం ప‌ని చేస్తూనే ఉంటారు. అలాంటి వ్య‌క్తే మంత్రి హ‌రీష్ రావు. తెలంగాణ స‌మాజంఆయ‌న‌కు ఆప్యాయంగా పెట్టుకున్న పేరు హ‌రీశ‌న్న‌. ఉద్య‌మస‌మ‌యంలోఆయ‌నోడైన‌మైట్. ఎప్పుడు ఎటునుంచివిరుచుకుప‌డ‌తాడోన‌ని నాటి అధికార‌ప‌క్షంహ‌డ‌లిపోయేది. ఆయ‌నమూమెంట్‌ను తెలుసుకునేందుకు ప్ర‌త్యేకంగా ఓ పోలీసు అధికారిని నియ‌మించారు. ఓ పోలీసు బృందం ఏర్పాటు చేసి మ‌రీఆయ‌న్ను ట్రాక్ చేస్తూ ఉండేవారు. మిలియన్ మార్చ్‌లోపాల్గొన‌కుండాహ‌రీశ్ రావు నియంత్రించేందుకు న‌లుదిక్కులుబందించారు నాటి పోలీసులు. గాలి నుంచి వ‌చ్చేచాన్సులేదుకాబ‌ట్టి, ఇక హ‌రీష్ రావు ట్యాంక్‌బండ్‌కుచేరుకోలేర‌ని నాటి పాల‌కులువిర్ర‌వీగారు. కానీ పోలీసుల ఎత్తుల‌నుచిత్తుచేస్తూ, పాల‌కప‌క్షంనివ్వెర‌పోయేలా హుస్సేన్ సాగ‌ర్‌లోబోడుదూసుకొచ్చినసాహ‌సిఆయ‌న‌. సాగ‌రహారంలో జిల్లాల నుంచి జ‌నం రాకుండా పోలీసులు బారికేడ్లు పెట్టారు. అడుగ‌డుగునాఅడ్డంప‌డ్డారు. అపుడుసిద్ద‌పేట నుంచి ఇర‌వై వేల మంది సైన్యంతో హైద‌రాబాద్ పోలీసుల వ్యూహాల‌పై దండెత్తిన హరీష్… ఆ బ్యారికేడ్ల‌నుబ‌ద్ద‌లుకొట్టారు. అంతెందుకు స‌డ‌క్‌బంద్ పేరుతో జాతీయ ర‌హాదారుల‌నుబందించాల‌ని చూస్తే.. నాటి స‌ర్కారుక‌ఠినంగాఅణ‌చివేసే కుట్ర చేసింది. ఒక్క‌డు, ఒకే ఒక్క‌డు ఆ కుట్ర‌ల‌ను ఛేదించాడు. ఒక‌టా రెండా ఇలా చెప్పుకుంటే పోతే ప్ర‌తి మజిలీలోనూ త‌న‌దైనముద్ర‌వేశారు. విద్యుత్ సౌధ ద‌గ్గ‌ర గిరిగీసి బ‌రిలో దిగి కొట్లాడారు హ‌రీష్ రావు. ఇలాంటి సంఘ‌ట‌నలుఆయ‌నగుండెదైర్యం, దీక్షాద‌క్ష‌త‌, కార్య‌సిద్దికి సాక్షీభూతాలుగా నిలిచాయి.రాజ‌కీయ వ్యూహాల్లో తిరుగులేని నాయకుడు హ‌రీష్ రావు. మేన‌మామ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లో మెలిగిన వ్య‌క్తి. కేసీఆర్ ఆదేశిస్తారు, హరీష్ రావు ఆచ‌రిస్తార‌నిటీఆర్ఎస్‌లో చెప్పుకుంటుంటారు. ఉద్య‌మం అయినా , ప్ర‌భుత్వపాల‌న అయినా కేసీఆర్ మ‌న‌సెరిగిన‌డుచుకుంటారుహ‌రీష్ రావు. హ‌రీష్ రావు కృషిని, ప‌ట్టుద‌ల ను ముఖ్య‌మంత్రి గుర్తించారు. అందుకే అరు అడుగుల బెల్లెట్అంటూకితాబిచ్చారు. యంగ్ డైన‌మిక్లీడ‌ర్ అన్నారు. మంత్రిగా బాధ్య‌త‌లుచేప‌ట్టినహ‌రీష్ రావును అంద‌రూప‌నిరాక్ష‌సుడుఅంటుంటారు . సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలోఆయ‌న కృషి ఆమోఘం. ప్రాజెక్టుల ద‌గ్గ‌ర చాప‌-దిండు వేసుకొని క‌టిక నేల ప‌డుకోవ‌డంఆయ‌ననిబ‌ద్ధ‌త‌కునిద‌ర్శనం. మంత్రి అంటే మందీమార్బలంతోవ‌చ్చి అలా పైపైన ప్రాజెక్టును చూసిపోవ‌డంగ‌తసంప్ర‌దాయం. ఏసీ గ‌దుల్లో కూర్చొని స‌మీక్షించ‌డంఆన‌వాయితీ. కానీ హ‌రీష్ రావు మాత్రం అనువ‌ణువుప‌రిశీలిస్తారు. ప్ర‌తిక్ష‌ణంస‌మీక్షిస్తుంటారు. పునాదులు స‌రిగాప‌డ‌కుంటే, భావిత‌రాలున‌ష్ట‌పోతాయ‌నిప‌రిత‌పిస్తుంటారు. అందుకే 24గంట‌ల్లో18గంట‌ల‌కు పైగా ప్ర‌జసేవ‌కే కేటాయిస్తున్నారు. జనంలో ఉండ‌టం, జ‌నంతోక‌లిసితిన‌డంఆయ‌న నిత్య కృత్యం. ఆయ‌న్ను చూస్తే జ‌నం కూడా త‌మ సొంత మ‌నిషినిచూసిన‌ట్టుధైర్య‌ప‌డ‌తారు. ఆయ‌నక‌దిలితే ఓ సైన్యం న‌డిచివ‌చ్చిన‌ట్టు ఉంటుంది. అందుకే ఆయ‌న మాస్ లీడ‌ర్‌గాప్ర‌జ‌ల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆయ‌నద‌క్క‌ర‌కుప‌నికోస‌మే, సాయం కోస‌మేవ‌చ్చిన వాళ్లు.. ఆ ఫ‌లాన్ని అందుకున్నారా లేదా అని కూడా క్రాస్ చెక్ చెయ్యడం ఆయ‌న‌కే చెల్లింది. హరీష్ రావు లేని టిఆర్ఎస్ ను చూడాలని కేటీఆర్’కరసేవకులు’ భావిస్తుండవచ్చునన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది. హరీశ్ రావు కోసం తాము తలుపులు ఎల్లవేళలా తెరచి ఉంచినట్టు కాంగ్రెస్, బిజెపి నాయకులు ఓ వైపు చెబుతున్నారు. కానీ హరీశ్ రావు అంతరంగంలో ఏమున్నదో తెలుసుకోవడం కష్టం. తన పుట్టుక – చావు టిఆర్ఎస్ లోనే అని హరీశ్ రావు లక్ష సార్లు చెప్పినా, కేసీఆర్ పట్ల విధేయతను చాటుకోవడానికి ఎన్ని తిప్పలు పడినా ఆయనపై ‘అనుమానపు చూపులు’ కొనసాగుతున్నవి. హరీష్ రావు తనకు తానుగా పార్టీని వదలివెళ్ళరని ఆయన మాటల్ని బట్టి, ప్రదర్శిస్తున్న విధేయతను బట్టి అర్ధమవుతున్నది. అయితే ఇప్పుడేం చేయాలి? బయటకు పంపడమెలా? అనే దిశగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయా! అనే చర్చ జరుగుతున్నది.

హరీష్ రావు సిద్ధిపేటకు పరిమితమైన నాయకుడు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాకు పరిమితమైన నాయకుడు కాదు. తెలంగాణ వ్యాప్తంగా పరిచయమైన మనిషి. తెలంగాణ అంతటా ‘ఫాలోయింగ్’ ఉన్న నాయకుడు.క్రౌడ్ పుల్లర్. హరీశ్ రావును సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం చేయడం ద్వారా, అధికారపార్టీ పత్రికలో జిల్లా పేజీల్లో కూడా మరీ లోపలి పేజీల్లోనూ వార్తలు ప్రచురించడం ద్వారా, ఆయనకు తెలియకుండా మిగతా ఉమ్మడి మెదక్ జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరపడం, ఎన్నికల కోసం సహాయ సహకారాలు అందించడం ద్వారా, ఆయనను ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానాలకు గురి చేయడం ద్వారా టిఆర్ఎస్ శ్రేణులకు, ప్రజలకు ఏ సందేశం పంపించదలచుకున్నట్టు? ఆ సందేశం ఇచ్చే ఫలితాలేమిటి? లాభమా- నష్టమా? ఈ ప్రశ్నలకు కేసీఆర్ లేదా కేటీఆర్ జవాబు చెప్పరు. వారిని ఎవరూ అడగరు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అనుకున్నదిఅనుకున్నట్లుగా జరుగుతుంది . లేకపోతే సీన్ అంతా రివర్స్ కావచ్చునన్న ప్రచారం సాగుతున్నది.హరీశ్ రావు ఎప్పుడూ ఒక వర్గాన్ని నడపలేదు. అలాంటి ప్రయత్నము చేయలేదు. తెలంగాణా రాష్ట్ర సమితి లో గ్రూపులు లేవని, కేసీఆర్ ఒక్కరే నాయకుడని ఆయన ఎన్నో సందర్భాలలో, సభల్లోనూ చెప్పారు. అయితే 2001 నుంచి హరీష్ రావు టిఆర్ఎస్ నిర్మాణంలో ఒక కూలీ గా పడిన శ్రమ వల్లనో, ఆయన రాజీ లేని వైఖరి, అంకితభావం వల్లనో కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన అభిమానులుగా, మద్దతుదారులుగా మారడాన్ని ఎట్లా తప్పు పడతారు. తాము టిఆర్ఎస్ లో ఉన్నంతకాలం హరీష్ రావు వర్గంగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అనవసరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్ హరీష్ రావుకు రాజకీయంగా నష్టం కలిగిస్తాయని కనీసం ఆలోచించకపోవడం సురేఖ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. అయితే క్రికెట్ జట్టు కెప్టెన్ తాను ఒక్కడేఆడతాననుకుంటేబోర్లా పడక తప్పదు. మిగతా ప్లేయర్లను కూడా ప్రోత్సహించాలి. వారిలో ఉన్న ప్రతిభను బట్టి బౌలింగ్, బ్యాటింగ్ దేనికైనా కెప్టెన్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. రాజకీయమూ అంతే. టిఆర్ఎస్ కెప్టెన్సీ విషయంలో ఇప్పటిదాకా వివాదమేదీ లేదు. జట్టు లోనే సమస్యలు ఉన్నవి. మొదట బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టును కకావికలం చేయగలిగిన ఆటగాడ్ని’ఎక్స్ ట్రా ప్లేయర్’ గా మైదానం బయటపెడితే ఎలా ? ” టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబంలో చీలిక అనివార్యం. బ్రహ్మ దేవుడు దిగివచ్చినా ఈ చీలికను ఆపలేడు. పదవుల కోసం కేసీఆర్ కుటుంబంలో సాగుతున్న అంతర్యుద్ధం రాజకీయాలలో పెను సంచలనాలకు తెరలేపనుంది. రానున్న కాలంలో టిఆర్ఎస్ ముక్కలవడం ఖాయం. నిట్టనిలువునా పార్టీ చీలిపోతుంది” అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్ళగొడతారని చాలాకాలం కిందట రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి, లక్ష్మణ్ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చీకట్లో బాణం విసరడం లాంటివని అనుకోవడానికి ఆస్కారం లేదు.ప్రత్యర్థులు టిఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఇటువంటి ప్రచారానికి దిగడం వెనుక అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలే కారణమని ప్రత్యేకంగా చెప్పవలసినవసరం లేదు.