అంతరాష్ట్ర దొంగ చంద్రశేఖర్ అరెస్ట్.

హైదరాబాద్:
అనంతపూర్ కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగ చంద్రశేఖర్ ను అరెస్టు చేశారు. ఇతను 2009 నుంచి నేరాలు చేస్తున్నాడని మాదాపూర్ డిసిసి వెంకటేస్వరరావు తెలిపారు.
మొత్తం 14 కేసుల్లో నిందితుడు,ఎనిమిది కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేశామని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలను మాత్రమే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలిపారు. గూగుల్ మ్యాప్ ద్వారా తాళాలు వేసి ఉన్న విల్లాలను గుర్తించి… బౌండరీలు చెక్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటాడని వివరించారు. అంతరాష్ట్ర దొంగ చంద్రశేఖర్ నుంచి 30 లక్షల విలువైన ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నట్టు డిసిసి తెలిపారు. ఏడు తులాల బంగారు ఆభరణాలు… అత్యంత ఖరీదైన నాలుగు చేతి గడియారాలు…8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఖరీదైన వాచ్ లలో 16 లక్షల విలువైన రోలెక్స్ కంపెనీ వాచ్ ఉందన్నారు.