అగ్రిగోల్డ్ నిందితులకు బెయిలు.

విజయవాడ:
అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్ లకు మచిలీపట్నం కోర్టు బెయిలు మంజూరు చేసింది.చార్జిషీట్ లో సిఐడి సరైన ఆధారాలు చూపించలేక పోయింది.సీఐడీ తీరును తప్పు పడుతూ బెయిల్ మంజూరు చేసిన కోర్టు. బెయిల్ మంజూరు చేసిన అవ్వా వెంకట రామారావు, అవ్వా ఉదయ్ భాస్కర్, అవ్వా మణిశర్మ, అవ్వా శేషు నారాయణ రావు, ప్రసాద్, సాయిరాం, కర్ణాటకలో అవ్వా వెంకట రామారావు, శేషు నారాయణ రావు లపై కేస్ పెండింగ్ లో ఉంది.మిగిలిన నిందితులు విడుదలయ్యే అవకాశం ఉంది.కడప, బందరు కేస్ లలో సూరిటీ లు సమర్పించడం లో జాప్యం కావడంతో నిందితులు గురువారం విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.