అది ‘జఫ్ఫా కూటమి’: కేటీఆర్.

హైదరాబాద్:
మహాకూటమిని ‘జఫ్ఫా కూటమి’అని మంత్రి కేటీఆర్ హేళన చేశారు.టీఆరెస్ విద్యార్ధి విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.విద్యార్థుల ఊపు చూస్తుంటే ఎన్నికల్లో టీఆరెస్ సెంచరీ కొట్టడం ఖాయమని చెప్పారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అన్ని ఉప ఎన్నికల్లో ప్రజలు తమను గెలిపించారని చెప్పారు.”ఉత్తమ్… సైనికుడివా? ఎప్పుడు అయినవ్ సైనికుడివి.కేటీఆర్ బచ్చా అంటున్నావ్. ఈ బచ్చాగాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావ్.రాహుల్ గాంధీ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోటీ ఇది.ఢిల్లీ బలుపుకు… తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ.తెలంగాణ బిక్షమేసినామని ఓ మహిళ నేత మాట్లాడారు. తెలంగాణను కాంగ్రెస్ బిక్షమేసిందా?
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…కాంగ్రెస్ కాటుకు ఓటు దెబ్బ.ఉత్తర కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలే.పొత్తులకు ప్రాతిపదిక ఉండాలి.
2004లో తెలంగాణ ఇస్తామని సోనియా మాట ఇస్తే కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్నాం.2009 లో చంద్రబాబును తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయించి పొత్తుపెట్టుకున్నాం. కోదండరామ్ పెద్ద పెద్ద డైలాగ్ లు కొట్టిండు.ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతానన్న… కోదండరాం వాటి
గోడలు గీకుతుండు. తెలంగాణ జన సమితి కాంగ్రెస్ భజన సమితి గా మారింది.ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసింది వాస్తవం కాదా?మహాకూటమి గెలిస్తే ప్రాజెక్టులు ముందుకు పడతాయా?రైతులకు ఈ విషయాన్ని తెలియజెప్పాలి.ఎగిరెగిరి పడుతున్న నాయకులు ఉద్యమంలో ఎక్కడున్నారు.
దొంగకు నోరెక్కువ అన్నట్లు ఒకాయన ధూమ్ ధూమ్ అంటున్నాడు.చంద్రబాబు తో కలవటానికి సిగ్గు, లజ్జ లేకపోయినా, తెలంగాణ ప్రజలకు మాత్రం స్వాభిమానం ఉంది. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం.ఉద్యోగాలపై క్షేత్ర స్థాయిలో చర్చ పెట్టండి.కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే స్థానికులకు ఉద్యోగాలు వచ్చేనా?ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ డొల్ల మాటలను ప్రజలు విశ్వసించరు. పెళ్లి కాని వాళ్ళకు పిల్లను చూసి పెళ్లి చేస్తాం.చిన్న పిల్లలకు డైపర్లు మారుస్తామని కూడా కాంగ్రెస్ మ్యానిఫెస్టో లో పెడతారేమో!!” అని కేటీఆర్ మండిపడ్డారు.