అది ‘సీ.వీ.సీ’ అధికారాలపై దాడి కాదు!!

న్యూఢిల్లీ:

సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ తొలగింపుపై దర్యాప్తును రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో రెండు వారాల్లోగా ముగించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ సీవీసీని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశం సీవీసీ అధికారాలపై దాడి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాలను సుప్రీంకోర్టు తోసి పుచ్చలేదని గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐలో చీఫ్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, మధ్యంతర చీఫ్ గా నియమితులైన నాగేశ్వరరావు అధికారాలను వెనక్కి తీసుకుందని అంటున్నాయి.సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సీవీసీ అధికారాలపై దాడి కానే కాదని.. ఈ కేసులోని అసాధారణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సర్వోన్నత న్యాయస్థానం అలా ఆదేశించిందని వివరణ ఇస్తున్నారు. తెలిపారు. దర్యాప్తు చేసే అధికారం సీవీసీ దగ్గరే ఉందని.. రెండు వారాల గడువు పరిమితి మాత్రమే విధించబడిందని అంటున్నారు. మధ్యంతర డైరెక్టర్ గా ఎం. నాగేశ్వర్ రావు నియామకాన్ని కూడా కోర్టు పక్కన పెట్టలేదని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించిందని గుర్తు చేస్తున్నారు.