అధికార పార్టీకి ఆ 14 ఉత్కంఠ.

కిషోర్, హైదరాబాద్:
మిగిలిపోయిన 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు కేసీఆర్ కసరత్తు పూర్తి కాలేదు. కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.14 లో కొన్ని స్థానాలలో కొన్ని చాలా క్రిటికల్ గా మారాయి.మేడ్చల్,మల్కాజిగిరి,ఖైరతాబాద్,హుజర్ నగర్, వరంగల్ తూర్పు,చొప్పదండి లాంటి స్థానాలను టిఆర్ఎస్ చాలా సున్నింతగా పరిశీలిస్తోంది. కాగా ఇందులో హుజూర్ నగర్ స్థానం మరింత ఆసక్తిగా మారింది.ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు 2014లో టిక్కెట్ ఇవ్వగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి కూడా టిక్కెట్ కోసం శంకరమ్మ పట్టుపట్టింది.. అయితే గడిచిన కొద్దిరోజులుగా శంకరమ్మ కొత్త ప్రపోజల్ లో ముందుకు వచ్చింది.ఎన్నారై అప్పిరెడ్డి కి టిక్కెట్ ఇవ్వాలని కోరుతుంది. అంతే తప్ప ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదని శంకరమ్మ హెచ్చరిస్తూన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఆయనను ఢీకొని గెలిచే అభ్యర్థి కోసం ‘గులాబీ దళం’ సాగిస్తున్న అన్వేషణ కొలిక్కి రావడం లేదు. ఇటీవలే పార్టీలో చేరిన ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ ఇస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. ఆయన తన అనుచరులతో ప్రచారం చేస్తున్నారు. తెలుస్తోంది. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడిన వారికి కాకుండా ఎవరికో టికెట్ ఇస్తే సహించబోమని ఆమె అన్నారు. ‘రోజూ ఒక ప్రకటనతో ప్రజలను మోసం చేయొద్దు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సైదిరెడ్డే కాకుండా 20 నుంచి 30 మంది ఎన్నారైలు ఉన్నారన్నది ఆమె వాదన. ఉత్తమ్ కుమార్‌కు సైదిరెడ్డి గట్టి పోటీ ఇవ్వగలరని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. శంకరమ్మనే ఎన్నారై అప్పిరెడ్డి కి మద్దతు ఇస్తున్నారు. సైదిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. ఆయనను హుజూర్ నగర్ నుంచి పారదోలుతాం అని శంకరమ్మ హెచ్చరించారు.