అన్నదాతల కష్టాలు.

మహబూబ్ నగర్;

అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి కుంటిసాకుతో అధికారులు కాలం వెళ్లదిస్తున్నారు. తిండి తిప్పలు మానేసి పంటను అమ్ముకునేందుకు కండ్లు కాయలు కాసేలా పరిస్థితి నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల తీరుపై ప్రత్యేక కథనం.ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మేందుకు వస్తున్న రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. కొనుగోలు దారుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పీఎసీఎస్ సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, పడకల్, వెలజల్ గ్రామాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో.. కొత్తగా వచ్చిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో వారం రోజులుగా రైతులకు ఎదురు చూపులే మిగిలాయి. కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేసినా అధికారులు స్పందించడంలేదని తెలుపుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు మాత్రం సివిల్ సప్లై అధికారులపై నెపం నెట్టేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలను పంపడం లేదని తెలుపుతున్నారు. మూడు కేంద్రాల్లో దాదాపు 5 వేలకు పైగా బస్తాలు నిలిచిపోయాయి.
బైట్.. గట్ల కేశవ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ తలకొండపల్లి
వాయిస్.. ఇప్పటికైన తమ ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ఇబ్బదులను తొలగించాలని సూచిస్తున్నారు.