అన్నలు మల్ల రావాలె!

విశ్వనాథ్‌, కరీంనగర్;
అన్నల భయానికి పట్నం చేరిన దొరలంతా ఇప్పుడు ఇన్నోవా, స్కారిపియో లాంటి భారీ వాహనాల్లో గ్రామాల్లో పచార్లు కొడుతుంటే గరీబోని గుండెలో గుబులు పుడుతోంది. పెత్తందారి వ్యవస్థ కనుమరుగై పోయిందని బీసీ ఎస్సీ సంతోషం మూన్నాళ్ల ముచ్చటయ్యింది. పాతికేళ్లుగా చల్లగా ఉన్న గ్రామాలు గులాభి పెత్తందార్ల రాకతో ఆ గ్రామాలు రాజకీయ కలుషితమయ్యాయి. జూలైలో జరగనున్న సర్పంచ్‌, ఎంపిటీసీ ఎన్నికల్లో ఇక దొరలు చెప్పిందే వేదంగా మారనున్నది. రిజర్వేషన్‌ అనుకూలిస్తే దొర గెలవాలి. కాదంటే దొర పాలేరే గెలవాలి. ఇలాంటి రోజు అప్పుడెప్పుడో 1980 కంటే ముందు ఉండేది. మారిన పరిస్థితుల మధ్య మళ్లీ గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే ఏర్పడడం విశేషం.నక్సలైట్ల భయంతో ఊరు విడిచి వెళ్లిన దొరల గడీల్లో జిల్లేడు చెట్లు మొలిస్తే భూముల్లో తంగేడు, సర్కారు తుమ్మలు పెరిగాయి. తిరిగొచ్చిన ‘దొర’ జేసిబి ట్రాక్టర్లతో భూములను చదును చేసి మళ్లీ వ్యవసాయం పేరుతో గ్రామాల్లో తిష్టవేశారు.
అన్నలు మల్ల రావాలె! కుబుసం విడిచిన పెత్తందారి వ్యవస్థ. ముసుగులో ‘దొర’తనం. పల్లెలలో రెడ్డి, వెలమల హడావిడి. బ్రాండీ షాపులు , వ్యభిచారం.

ఓ కిషన్‌జీ…. ఓ చిన్నన్న… ఓ సుదర్శన్‌ రెడ్డి…. ఓ సాగర్‌… ఓ పటేల్‌ సుధాకర్‌ రెడ్డి… శాఖమూరి అప్పారావు… వీళ్లందరినీ జనం మననం చేసుకుంటున్నారు. 15 ఏళ్లుగా తెంగాణ జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో కనుమరుగైన మావోయిస్టులను బడుగు జనం తలచుకుంటోంది. మళ్లీ వస్తే మావోయిస్టులను తమ కడుపులో దాచుకుంటామని, కనుపాపలా చూసుకుంటామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని పట్నం చేరిన రెడ్డి, వెలమ దొరలంతా పల్లెకు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌లతో తెంగాణ ప్రాంతంలోని మావోయిస్టులు నేలకొరిగిపోయారు. మైదాన ప్రాంతంలో అక్కడక్కడ మిగిలిన దళాలన్నీ దండకారణ్యంలోనికి వెళ్లిపోయాయి. 15 యేళ్లుగా తెంగాణ ప్రాంతంలోని నక్సలైట్ల దళాలు వెళ్లిన సమయంలోనే టిఆర్ఎస్ దళాలు గ్రామాల్లో మోహరించాయి. తెంగాణ తెస్తామంటూ గాయి చేశాయి. తెంగాణ సాధిస్తే బడుగు జీవితాలు బాగుపడుతాయని గొంతు కలిపిన బీసీ, ఎస్సీ వర్గీయులకు నిరాశే ఎదురయ్యింది. ఆశ సంగతి అలా పక్కన బెడితే గ్రామాల్లో చేరిన దొర బెదిరింపులు ఎక్కువయ్యాయని ఆవేదన చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గతంలో ‘దొరల’ పెత్తనం,పోలీసుల అరాచకాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నా ‘అన్నల’ ధైర్యంతో తాము ఆత్మగౌరవంతో బతికామని పెద్దపల్లి జిల్లా పాలకుర్తికి చెందిన రమేశ్ మాదిగ అనే దళితుడు వాపోతున్నాడు.దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కల్లోలితప్రాంతాలుగా ఉండిన జగిత్యాల,సిరిసిల్ల ప్రాంతాల్లో పూర్వపు దొర పోకడలు మళ్ళీ కనిపిస్తున్నట్టు స్థానిక మండల స్థాయి పత్రికా విలేకరులు చెబుతున్నారు.ఇప్పుడు కొత్త తరహా ‘దొర స్వామ్యం’ పురుడుపోసుకున్నదని సారంగాపూర్ కు చెందిన మల్లాగౌడ్ చెబుతున్నాడు.

గ్రామాల్లో 1978 నుంచి 2004 వరకు కనుమరుగైపోయిన దొరలు, వారి బెదరింపులు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో, రోడ్లు ,ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో, నిర్మాణ రంగాల్లో ‘దొర’దే పెద్ద వాటా అవుతోంది. ‘ ఎన్నో ఏళ్ల క్రితం ఊరిని,భూములను అన్నల భయానికి విడిచి వెళ్ళిపోయిన భూస్వాములకు రైతుబంధు కార్యక్రమం రూపంలో నష్టపరిహారం అందిస్తున్నట్టుగా ఉంద’ని కాంగ్రెస్ న్యాయవాది మహేందర్ చెప్పారు.ఎకరాకు రూ.4వేలు అందిస్తే ఓ ఊరి దొరకు రూ.2లక్షలు వస్తే అదే ఊరిలో నివసిస్తున్న దళిత రాజయ్యకు రూ.2వేలు చేతికందాయి. వచ్చిన తెలంగాణ… ప్రభుత్వం యిచ్చిన రైతు బంధు చెక్కు ఎవడిపాలైంది… అంటూ పాటకు కోరస్‌ దొరికింది. అన్నల భయానికి పట్నం చేరిన దొరలంతా ఇప్పుడు ఇన్నోవా, స్కారిపియో లాంటి భారీ వాహనాల్లో గ్రామాల్లో పచార్లు కొడుతుంటే గరీబోని గుండెలో గుబులు పుడుతోంది. పెత్తందారి వ్యవస్థ కనుమరుగై పోయిందని బీసీ ఎస్సీ సంతోషం మూన్నాళ్ల ముచ్చటయ్యింది. పాతికేళ్లుగా చల్లగా ఉన్న గ్రామాలు గులాభి పెత్తందార్ల రాకతో ఆ గ్రామాలు రాజకీయ కలుషితమయ్యాయి. బ్రాండీ షాపులు, బెల్ట్ షాపులు, స్మార్ట్‌ ఫోన్‌లు… వాటి ప్రభావంతో వ్యభిచారం పెరిగింది. ఒకనాడు గ్రామంలో వ్యభిచరించిన వారికి ‘ప్రజాకోర్టు’ ఏర్పాటుచేసి శిక్షించేవారు ఇప్పుడు కరువయ్యారు. తాగి ఊగి తందనాలు ఆడేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. రానున్న జూలై మాసంలో జరగనున్న సర్పంచ్‌, ఎంపిటీసీ ఎన్నికల్లో ఇక దొరలు చెప్పిందే వేదంగా మారనున్నది. రిజర్వేషన్‌ అనుకూలిస్తే దొర గెలవాలి. కాదంటే దొర పాలేరే గెలవాలి. ఇలాంటి రోజు అప్పుడెప్పుడో 1980 కంటే ముందు ఉండేది. మారిన పరిస్థితుల మధ్య మళ్లీ గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే ఏర్పడిరదంటున్నారు.నక్సలైట్ల భయంతో ఊరు విడిచి వెళ్లిన దొరల గడీల్లో జిల్లేడు చెట్లు మొలిస్తే భూముల్లో తంగేడు, సర్కారు తుమ్మలు పెరిగాయి. తిరిగొచ్చిన దొర జేసిబి ట్రాక్టర్లతో భూములను చదును చేసి మళ్లీ వ్యవసాయం పేరుతో గ్రామాల్లో తిష్టవేశారు. ఇక సర్కారు సైతం రైతు పేరిట రైతు బంధు స్కీమ్‌ను అందించడంతో దొర చేతికి సీజన్‌కు రూ.2లక్షల చొప్పున చేతిలో పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు స్కీమ్‌లో గ్రామానికి రూ.కోటి చొప్పున చేరుకుంటే ఊరందరికి రూ.30 లక్షలు, భూమున్న దొరకు రూ.70 లక్షలకు పైగా దక్కాయి. లెక్కలు కట్టిన జనం బెంబేలెత్తిపోతున్నారు. సర్కారిచ్చే సాయం పేదోడికా ఉన్నోడికా అనే లెక్కల్లో మునిగిపోయారు. చివరికి తేలింది భూస్వాముల బంధువు గానే తేటతెల్లమయ్యింది. తెలంగాణ పోరాటం పుణ్యమాని పారిపోయిన దొరలంతా మళ్లీ గద్దిస్తున్నారు. అన్నలే ఉంటే మన పరిస్థితి ఇలా ఉండేదా అంటూ ప్రశ్నించుకనే వారి సంఖ్య గ్రామాల్లో కనిపిస్తుంది. ఇక గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే స్వయంగా పోలీసు అధికారులే నక్సలైట్ల కాంలోనే తమకు విలువ ఉండేదని ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ పోస్టింగ్‌ కోసం తిరిగి తిరిగి… ఖాకీ బట్ట ఖదర్‌ తగ్గిపోయిందని అంటున్నారు. అన్న కోసం ఎదురుచూస్తున్న వారిలో పోలీసు అధికారులు లేకపోలేదు. చత్తీస్‌ఘడ్‌, ఒడిశా, జార్ఖండ్‌, మహారాష్ట్ర లాంటి దండకారణ్యంలో ఉన్న అన్నలు తెంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే రోజులు వస్తాయా?