అభ్యర్థుల ఎంపిక. కాంగ్రెస్ ‘మాదిగ’ల గరం.. గరం.. ఢిల్లీ కి మంద కృష్ణ.

హైదరాబాద్:

మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో మాదిగ సామాజికవర్గ నాయకులు బుధవారం భేటీ అయ్యారు. మంద కృష్ణ మాదిగ,సంపత్,గజ్జల కాంతం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రీజర్వ్ డ్ నియోజకవర్గ లో కనీసం మాదిగలకు 11 స్థానాలు కేటాహించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.కనీసం ఎస్సీ నియోజకవర్గ స్థానలో ఎవరికి టికెట్ కేటాయించాలన్న అంశంపై ఎస్సీ సీనియర్ నేతల అభిప్రాయం తీసుకోకపోవడం పట్ల నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాహింపులో ప్రాధాన్యత కల్పించాలని రాహుల్ ను మందకృష్ణ మాదిగ గురువారం కలవనున్నారు.