అభ్యర్థుల మార్పు తప్పదు.”రాజయ్య కొన్ని తప్పులు చేశాడు”- పల్లా రాజేశ్వరరెడ్డి.

ఎస్.కె. జకీర్.

టిఆర్ఎస్ అభ్యర్థుల మార్పులు, చేర్పులు తప్పవని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ”ప్రకటిత అభ్యర్థుల పనితీరుపై సర్వేకు గాను ఇంటెలిజెన్స్ సంస్థలు, కొన్ని ప్రయివేటు సంస్థలు పనిచేస్తున్నవి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిరోజు సాయంత్రం నివేదికలు అందుతున్నవి. వాటిని ఆయన ప్రతి రోజు పరిశీలిస్తున్నారు. సమీక్షిస్తున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నమాట నిజమే. స్టేషన్ ఘనపూర్ అభ్యర్థి రాజయ్య చేసిన తప్పిదాలు తెలిసినవే. ఈ సెగ్మెంటు నుంచి ప్రతాప్ చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. ఆయనకు ఈ సారి రాకపోవచ్చు. ఆయనకు వేరే ప్రత్యామ్నాయం కేసీఆర్ తప్పకుండా చూపుతారు.అభ్యర్థుల మార్పు పై అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ దే. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అందరు శిరసావహించవలసిందే. నేను కూడా పార్టీ కార్యకర్తను. కేసీఆర్ మాటే ఫైనల్” అని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పర్యటన సందర్బంగా పల్లా అన్నారు.