‘అమరావతికి’ మేము బానిసలం కాదు, ‘తెలంగాణ ప్రజలకు’ బానిసలం – రేవూరి ప్రకాశ్ రెడ్డి

ప్రజలను తప్పుదారి పట్టించేలా చరిత్రను వక్రీకరించే విధంగా మంత్రి కెేటిఆర్ మాట్లాడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు *రేవూరి ప్రకాశ్ రెడ్డి* అన్నారు

నేడు తేదీ 25-09-2018 మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో *రేవూరి ప్రకాశ్ రెడ్డి* మాట్లాడుతూ తండ్రి పేరు చెప్పుకుని ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన వ్యక్తి కెేటిఆర్ అని, నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉందని బీరం సంజీవరెడ్డి అనే వ్యక్తి టిడిపి నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారని మాట్లాడం కెేటిఆర్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని, పెద్ది సుదర్శన్ రెడ్డి నీవు కలిసి ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడారని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నా ఏ కాస్త తెలంగాణ పౌరుషం ఉన్నా బీరం సంజీవరెడ్డికి టిడిపి సభ్యత్వ కార్డు ఉన్నట్లు గాని గత 10సంవత్సరాలుగా తనతో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఉన్నట్లుగా 24 గంటల్లో చూపించాలని డిమాండ్ చేశారు

ప్రజలను మోసపుచ్చడం మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం నీకు, నీ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యని ఆరోపించారు.

హంతక పార్టీలతో పొత్తు అని మాట్లాడే ముందు ఎవరి పార్టీ హంతకుల పార్టీనొ తెలుసుకుని మాట్లాడాలని, యువకులను రెచ్చగొట్టి ఆత్మబలిదానాలను ప్రేరేపించి 1200మంది అమరులకు కారణం నీ బావ హరీశ్ రావు, నీ కుటుంబం కాదా అని యువత ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణను నీ కుటుంబం దోచుకు తిన్నది ..2008కి పూర్వం నీవు, నీ అక్క అమెరికాలో ఉన్నది వాస్తవం కాదా అని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు

ఏ అమరుల కుటుంబాలను ఎంపీ, ఎమ్మెల్యేను చేశారో చెప్పాలని తొలి, మలి దశ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను మరిచి దుర్మార్గమైన పాలన గత 4½సంవత్సరాలుగా చేశారని తెలంగాణ రావడానికి నీవు నీ కుటుంబము ఎలాంటి త్యాగాలు చేయలేదని, విశ్వవిద్యాలయ విద్యార్థులు అసెంబ్లీని పెద్ద ఎత్తున ముట్టడించేందుకు కార్యక్రమం తీసుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మరిచిపోవడం సిగ్గుచేటు అని అన్నారు

గత 4½సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి ఏంటో అమలు చేసిన మేనిఫెస్టోలోని హామీలు ఏంటో ప్రజలకు వివరించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ని ప్రాజెక్టులను అడ్డుపెట్టుకుని తప్పుడు సమాచారంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రజల నుంచి సానుభూతి పొందాలనే ప్రయత్నం చేయడం మీ అసమర్థతను కప్పి పుచ్చుకోవడం మాత్రమేనని ఏ ప్రాజెక్టును బాబు అడ్డుకున్నారో చెప్పాలని అన్నారు ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి టెండర్లు పిలిచింది చంద్రబాబు నాయుడు ని, చంద్రబాబు నాయుడు రెండవ సారి ఉత్తరం ఇస్తే ఎన్టీఆర్ భవన్ లో అటెండర్గా చేస్తానన్న హరీష్ రావు మాట నిలుపుకోలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నాడు చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందని తెలంగాణ కోసం మొట్టమొదటిగా రాజీనామా చేసింది తాను మాత్రమేనని అన్నారు

*అమరావతికి మేము బానిసలం కాదని తెలుగు జాతికి సేవకులం తెలంగాణ ప్రజలకు బానిసలమని*, టీఆర్ఎస్ మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను మీరు మీ కుటుంబం బానిసలుగా చేసుకున్నారని సభ్యత సంస్కారం లేకుండా అహంకారంతో మాట్లాడటం సబబు కాదని ప్రకాశ్ రెడ్డి మంత్రి కెటిఆర్ ను హెచ్చరించారు

నియంతలా వ్యవహరిస్తూ ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకు మహాకూటమిగా ఏర్పడ్డామని, నీళ్లు నిధులు నియామకాలు స్వయం పరిపాలన అనే అంశాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆశయాలకు విరుద్ధంగా పాలిస్తున్న కెేసిఆర్ కుటుంబ కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి చేసేందుకే మహా కూటమి ఎజెండాతో వచ్చే ఎన్నికలలో మేము ప్రజల ముందుకు వస్తున్నామని మహా కూటమిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేక తెలంగాణ సెంటిమెంటును మళ్లీ ప్రజలపై రుద్ది రాజకీయ లబ్ధి పొందాలని టీఆర్ఎస్ వారు చూస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా అమరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షల మేరకు ఏకమై మహా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతి పెట్టడం జరుగుతుందని ప్రకాశ్ రెడ్డి అన్నారు