అమర్నాధ్ యాత్ర కు ఆటంకం.

శ్రీనగర్:
అమర్ నాథ్ యాత్రకు మళ్లీ ఆటంకం ఏర్పడింది. బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలతో యాత్ర ముందుకు సాగడంలేదు. ఇవాళ మరింత పెరిగాయి. పెహాల్‌గాం, బలాతల్ ప్రాంతాల్లో యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. యాత్రికులు బేస్‌క్యాంప్‌కే పరిమితమయ్యారు. వర్షాలకు అక్కడక్కడ కొండచర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో యాత్ర సురక్షితం కాదంటూ వాతావరణశాఖ తెలపడంతో నిలిపివేశారు అధికారులు. బుధవారం సోనామార్గ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు యాత్రికులు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని శ్రీనగర్‌లోని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు.