అమిత్ షా తో స్వామి పరిపూర్ణానంద భేటీ!!

న్యూఢిల్లీ:

‘వివాదాస్పద స్వామి’ పరిపూర్ణానంద సోమవారం ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకున్నారు. తెలంగాణలో బిజెపి పెద్దగా కదలిక రాకపోతుండటంతో ఆ పార్టీ ఇక ‘స్వామీజీ’ వైపు చూస్తున్నదని చాలా రోజులు గా వార్తొలస్తున్నాయి. ఆయనను అసెంబ్లీకో లేదా పార్ల మెంటుకో నిలబెడతారని చెబుతున్నారు. ఈ సారి సికింద్రబాద్ లోక్ సభ స్థానానికి స్వామీజీ పోటీ చేస్తారని ప్రచారమయింది. స్వామీజీకి కేంద్ర కార్యాలయం ఆంధ్రలో ఉన్నా ఆయన కార్యనిర్వహాక రాజధాని మాత్రం హైదరాబాదే. ఈ మధ్య కత్తి మహేశ్ రామాయణం మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి స్వామీజీ బాగా వార్తల్లోకెక్కారు. ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బ హిష్కరించింది. తర్వాత కోర్టు జోక్యంంతో ఆయన మీద నిషేధం ఎత్తి వేశారు.బిజెపి ఆయనను తెలంగాణ ఆదిత్యనాథ్ యోగి లాగా చేయాలనుకుంటున్నదని, ఆయనను ముందు పెట్టుకుని ఈ ఏన్నికలకు వెళ్లాలనిచూస్తున్నదని బిజెపి నాయకులే చెబుతున్నారు. హైదరాబాద్ నిండా హిందువులున్నా, ఎంఐఎం తో ధీటుగా రాజకీయాల్లో బిజెపి ఎదగ లేకపోవడం అమిత్ షాను బాధిస్తున్నదట. అందువల్ల కనీసం ఎంఐఎం లాాాగా హైదరాబాద్ లో అరేడు అసెం బ్లీ స్థానాలను కోటల్లాగా తయారుచేసుకోవాలని బిజెపి ప్లాన్ వేస్తున్నది.మోదీ హయాంలో హైదరాబాద్ లో ఎంఐఎంను పునాదులు కదలించకపోతే ఇక ఎప్పటికీ చేయలేమన్న వర్రీ బిజెపి నాయకత్వంలో ఉంది.ఈ భేటీ పై అధికారకంగా వివరాలు వెల్లడి కావడం లేదు.