అమెజాన్’ భలే మంచి చౌక బేరమ్.

న్యూఢిల్లీ:

నిన్న మధ్యాహ్నం నుంచి అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమ్మకాలు ప్రారంభించిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ అర్థరాత్రి నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. ఫ్యాషన్ ప్రియుల కోసం అమెజాన్ భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. కుర్తీలు, డ్రెస్సులు, పీప్ టోస్, సన్ గ్లాసెస్, జాకెట్స్, లాప్ టాప్ బ్యాగులు.. పురుషులు, మహిళల ఫ్యాషన్ యాక్సెసరీస్, షూస్ పై కనీవినీ ఎరుగని రాయితీలు ఇస్తోంది. పురుషులు, మహిళల దుస్తులు 50-80% వరకు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. క్లార్క్స్, రెడ్ టేప్, బాటా వంటి పాదరక్షల బ్రాండ్లపై 40-80 % వరకు డిస్కౌంట్ అందజేస్తోంది. అమెరికన్ టూరిస్టర్, లావీ, స్కైబ్యాగ్స్ వంటి అగ్రశ్రేణి లగేజ్, హ్యాండ్ బ్యాగ్ ల బ్రాండ్లు 50-80% చౌకగా లభ్యం కానున్నాయి.మహిళల ఫ్యాషన్ లో ఎంతో పేరు మోసిన బీబా అనార్కలీ కుర్తా ధర రూ.3,399. కానీ ప్రైమ్ సభ్యులకు ఇది కేవలం రూ.1,699కే అందిస్తున్నారు. లావీ వుమెన్స్ పంప్స్ ఎమ్మార్పీ రూ.2,999 ఉండగా 70% రాయితీ ఇచ్చి రూ.899కి అమ్ముతున్నారు. ఎలివేట్ వుమెన్ కి చెందిన వుమెన్స్ ఫిట్ అండ్ ఫ్లేర్ మల్టీకలర్ డ్రెస్ 63% డిస్కౌంట్ కి రూ.699కే (ఎమ్మార్పీ రూ.1,899) లభ్యం కానుంది. ఎమ్మార్పీ రూ.1,999 టోన్ స్కార్క్ స్టీమ్ పంక్ రౌండ్ మిర్రర్డ్ మెన్ వుమెన్ సన్ గ్లాసెస్ రూ.649కే విక్రయిస్తున్నారు. రూ.2,599 ఉండే వోయ్లా ఆక్సిడైజ్డ్ వెండి చాంద్ బాలీ చెవిరింగులు 88% తగ్గించి రూ.305+రూ.75(డెలివరీ ఛార్జీలు)కే అందజేస్తున్నారు.రూ.2,199 ఖరీదైన బ్లాక్ బెర్రీ చినోస్ 55% డిస్కౌంట్ కి రూ.989కే లభిస్తాయి. ఇది కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే పరిమితం. ప్రైమ్ సభ్యులకి బ్లాక్ బెర్రీ మెన్స్ జాకెట్ (ఎమ్మార్పీ ధర రూ.2,199) 60% తక్కువగా రూ.989కి లభ్యమవుతాయి. బాటా నీల్ లోఫర్స్ రూ.349-559 మాత్రమే. డానీ డేజ్ యువీ ప్రొటెక్టెడ్ ఏవియేటర్ యునిసెక్స్ సన్ గ్లాసెస్ పై 70% భారీ రాయితీ ఇస్తున్నారు. ఎమ్మార్పీ రూ.999 ఉన్న ఈ సన్ గ్లాసెస్ కేవలం రూ.299కే అందజేస్తున్నారు. రూ.2,999 ఖరీదైన ఇన్సాస్టా డాక్రాన్ గ్రే ల్యాప్ టాప్ బ్యాక్ ప్యాక్ 76% తక్కువకి రూ.728+రూ.32(డెలివరీ ఛార్జీలు)కే దొరకనుంది.