అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు.

హైదరాబాద్:
లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మన పండుగలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.సోమవారం జరిగే ఊరేగింపునకు భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తలసాని పేర్కొన్నారు. అన్ని పండుగలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. మంత్రి తలసాని వెంట మాజీ మంత్రి దానం నాగేందర్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.నగరంలోని బోరబండలో పోచమ్మ అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పట్టువస్ర్తాలు సమర్పించారు. మంత్రితోపాటు అమ్మవారిని ఎమ్మెల్యే గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఈ తెల్లవారుజామునుంచే పోటెత్తారు.