“అమ్మాయిలను సరఫరా చేస్తున్న కేటీఆర్ బామ్మర్ది” – రేవంత్ రెడ్డి:

హైదరాబాద్:
కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డేటింగ్ ఏర్పాటు చేసిన సంస్థ ఏర్పాటు చేసి అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఆరోపించారు.3వేలు డబ్బులు కడితే ఒక అబ్బాయితో ముగ్గురు అమ్మాయిలను కట్టబెట్టే విధంగా కేటీఆర్ బామ్మర్ది సంస్థ పనిచేస్తుందన్నారు.అమ్మాయిల ,అబ్బాయిలకు బ్రోకర్ గా రాజ్ పాకాల రావు ఈవెంట్ పనిచేస్తున్నట్టు ఆరోపించారు.సీఎం కుటుంబ సభ్యులలే ఇలా చేస్తుంటే రాష్ట్రం ఏమైపోతుందని రేవంత్ ప్రశ్నించారు.’సెన్సేషన్ ఈవెంట్’ పై ఈసీ చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు.నిజంగా ‘మూజికల్ నైట్’ ఐతే ఇంత రహస్యం ఏంటి ..? అని అన్నారు.అధికారులు స్పందించపోతే తాను గచ్చిబౌలి స్టేడియం వెళతానని రేవంత్ తెలిపారు.’సెన్షేషన్ ఈవెంట్’ ను అడ్డుకుంటా మని తెలిపారు. అమ్మాయిలను సరఫరా చేసే రాజ్ పాకాల కంపెనీని ఏమంటారో పోలీసులు చెప్పాలన్నారు.’ఈవెంట్’ లతో మధ్యతరగతి పిల్లలను టార్గెట్ గా అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ‘సెన్షేషన్ ఈవెంట్’ ను అడ్డుకోవాలని ఇప్పడికే కోర్ట్ కు వెళ్లామని రేవంత్ చెప్పారు.

తెలంగాణను వ్యసన పరులు ,తాగుబోతుల కేంద్రంగా కేసీఆర్ మార్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.ప్రజలకు వ్యసనాలను అలవాటుచేస్తు చైతన్యాన్ని చంపేస్తుందన్నారు.’ఈవెంట్’ లలో డ్రగ్స్ యథేచ్చగా వాడుతున్నా ప్రభుత్వానికి పట్టదన్నారు. ‘సెన్సేషన్ ఈవెంట్’ కు నిభందనలు పట్టించుకోకుండా అనుమతులిచ్చిందని ఆరోపించారు. ‘సెన్షేషన్ ఈవెంట్’ కు పోలీసుల పహారాలో నడపాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.క్రీడలకోసమని గచ్చిబౌలి స్టేడియంను ‘తాగుబోతుల నైట్స్ అడ్డా’గా మార్చారని విమర్శించారు.సెన్షేషన్ ఈవెంట్ కు ఈసీ అనుమతి తీసుకున్నారా ..? అని ప్రశ్నించారు.ఈ ఈవెంట్ లో ఒక్కో టికెట్ కు లక్ష యాభైవేల నుండి 5లక్షల వసూలుచేస్తున్నారంటే ,అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.
5లక్షల టికెట్ కొన్నవారు లోపల విశృంఖలతకు పాల్పడుతున్నారని చెప్పారు.కేటీఆర్ బామ్మర్ది ఐతే ‘డేటింగ్ క్లబ్’ పెట్టొచ్చా ..? అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.స్కూల్ విద్యార్థులను ఈ ఈవెంట్ కు అనుమతి ఇస్తున్నారని తెలిపారు.

గతంలో జరిగిన ‘సన్ బన్ పార్టీ’ ఈవెంట్ వీడియో అందచేయమని కోర్ట్ చెప్పినా ఇప్పటికీ అందించలేదన్నారు.కేటీఆర్ బంధువులైన మాదాపూర్ డిసిపి ,ఎసిపి ఈవెంట్ కు పహారా కాస్తున్నారని రేవంత్ ఆరోపించారు.డ్రగ్స్ పై ఇప్పడికి ఎందుకు ప్రభుత్వం నివేదిక బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు.