అమ్మో సర్పంచ్ పదవా…!!?

జూలైలో పంచాయతి ఎన్నికలు రాబోతున్నాయి.సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు గ్రామ స్థాయి నాయకులు హడలిపోతున్నారు.దీనికి కారణం అడుగడుగునా అవినీతి,నిధుల కొరత కారణమని ప్రస్తుత సర్పంచ్ లు చెబుతున్నారు.డబ్బులు తీస్కొనిది జనం ఓటు వెయ్యరు.కమిషన్ తీస్కొనిది డి.ఇ.,ఏ.ఇ .,ఇ.ఇ లు ఎంబీ ఇవ్వరు. ఎంబి తీసుకువస్తే గ్రామ పంచాయతి కార్యదర్శి కౌoటర్ సిగ్నేచర్ చెక్ పైన పెట్టాలంటే  2% నుంచి 6% వరకు ఇవ్వవలసిందే.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కి ఒక్క రూపాయి కూడ ఇవ్వలేదు. చిన్న గ్రామపంచాయతీ అయితే 5 లక్షలు, పెద్ద గ్రామపంచాయతీ అయితే 15 లక్షలు ఖర్చుపెట్టి ఒక వ్యక్తి సర్పంచ్ గా గెలిచాక ఆవ్యక్తి నిధులు లేక అల్లాడిపోతున్నాడు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అర కోర నిధులతో వీధి దీపాలు వేయడం,చెడిపోయిన బోర్లనూ రిపేర్ చేయడం, ఉన్న నిధులతో సీసీ రోడ్ వేయడం అదనంగా బోర్లు వేయించడం నాలాలు తీయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అభివృద్ధికి నిధులు రాక  ఉదయం 6 గంటలకు లేచి తయారు అయ్యి ఎం.ఎల్.ఏ ఇంటికి పోయి రాత్రి పది దాకా ఆయన ఏ ఊరిలో ప్రోగ్రామ్ ఉందంటే ఆ ఊరికి పోయి రోజు మొత్తం చాయల మీద,సమోసల మీద బతికి రాత్రి పదింటికి ఇంటికి వచ్చి బుక్కెడంత బువ్వ తిని మళ్ళీ తెల్లారి లేచి మళ్ళీ మామూలే. అబ్బా ఈ సర్పంచ్ మనోడే, మన వర్గమే మన అభిమానే అని ఏ రెండు ఏండ్లకో,మూడు ఏండ్లకో ఒక్క పని ఇస్తే దానికి డి.ఇ (3%), ఏ.ఇ (5%), ఇ.ఇ 2% అన్నీ అయ్యాక ఎం. బి తీసుకోని  గ్రామ కార్యదర్శి కి చెక్ కొరకు పొతే 3% నుంచి 6% వరకు డిమాండ్ చేస్తున్నాడు. తిప్పి,తిప్పి పై పర్సంటెజి తీసుకోని చెక్ రాసుకొని ట్రెజరీ కు పొతే దానికి ‘ప్రీజింగ్’. అ నిధులు ఎప్పుడు వస్తాయో తెలియనిది.కమిషన్ ఇచ్చి ఒక్క పని సీ.సీ రోడ్ లేదా ఇంకా ఏదైనా చిన్న పని ఇస్తే దానికి పైసలు బయట నుండి రెండు రూపాయలు కోన్ని గ్రామాల్లో అయితే రూ 5 కు మిత్తికి తీసుకొని వచ్చి ఆ పని చేయంచిన తర్వాత పరిస్థితి. ఆ పని మొత్తం అయ్యాక ఆ పని పైసల కోసం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగి ఏ యడాదికో వాడిని,వీడిని బతిలాడి చేసిన పని పైసలు మంజూరు చేస్కొని మిత్తి తెచ్చిన కాడ కట్టంగా సర్పంచ్ కి మిగిలేది ఏమీ లేదు.ఇక 5 ఏళ్లలో వచ్చే పండగల కు తెల్లారి ఎవరు ఏమీ అడుగు తారో తేలదు.గ్రామంలో ఎవరైనా చనిపోతే సర్పంచ్కు ఖర్చు తప్పదు. బార్య భర్తలు కోట్లాడుకున్నా సర్పంచ్ దగ్గరికి కేసు వస్తుంది. పండుగలకు లైట్లు,కనీస వసతులు ఏర్పాటు చేయడం కోసం జేబుల నుండి సొంత పైసలు తీసి పెట్టడం, వాటికి సంబంధించిన బిల్ వస్తే తీసుకోవడం లేకపోతే వదిలెయ్యడం. తర్వాత ఊరిలో ఉన్న సర్పంచ్ వ్యతిరేక వర్గం సర్పంచ్ మీద యస్సి. యస్టీ కేసులు పెట్టించడం వంటి ఘటనలు మరింత కలవరపెడుతున్నవి.వీధి దీపాలు పగల గొట్టడం,నల్లాల బావి  మోటార్ కాలబెట్టడం,బజారులో మంచి మోరం పోయలేదని పిర్యాదు చేయడం లాంటివి  జరుగుతున్నవి. వాటికి కూడా జేబుల నుండి సొంత పైసలు తీసి పెట్టడం మళ్ళీ రాత్రి ఎవడో ఒకడు తాగి వచ్చి కావాలని సర్పంచ్ ను కుక్క బూతులు తిట్టడం ఇవన్నీ భరిస్తూ ప్రభుత్వం నుండి పైసలు రాక భూమి ఉన్నోడు భూమి అమ్ముకోవలసి వస్తుంది. భూమి, జాగా, ఆస్తులు లేని వాడు ఎం పని చేస్తలేడు అని జనం చేతిలో తిట్లు తినుకుంటు బతుకుతున్నారు..
పరిస్తితి ఇలా ఉంటే యువత రాజకీయాల్లోకి ఎలా వస్తుంది. వ్యవస్ధలో మార్పు ఎలా వస్తుంది?
డబ్బులు తీస్కొనిది జనం ఓటు వెయ్యరు.కమిషన్ తీస్కొనిది డి.ఇ.,ఏ.ఇ .,ఇ.ఇ లు ఎంబీ ఇవ్వరు. ఎంబి తీసుకువస్తే గ్రామ పంచాయతి కార్యదర్శి కౌoటర్ సిగ్నేచర్ చెక్ పైన పెట్టాలంటే  2% నుంచి 6% వరకు ఇవ్వవలసిందే.