అరకులో పేలిన తూటా. తెలంగాణలో హై అలర్ట్.

విశ్వనాథ్,కరీంనగర్:
అరకు ఎమ్మెల్యే ను మావోయిస్టులు ఆదివారం కాల్చి చంపారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార తెలుగుదేశం పార్టీని మావోయిస్టులు చాలా కాలం నుంచి టార్గెట్ చేశారు. అరకు ఎమ్మెల్యే ను హెచ్చరించిన నక్షలైట్లు అదును చూసుకొని హతమార్చడం తెలంగాణ రాష్ట్రం లో కలవరం రేపుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మైదానంలో మావోయిస్టుల కార్యక్రమాలు పెద్దగా లేవు.2010 నుంచి మైదానంలో మావోయిస్టుల దాడులు తగ్గినాయి. తెలంగాణ కు అనుకొన్న చత్తిస్ ఘడ్.మహారాష్ట్ర… సరిహద్దుల్లో మావోదళాలు సంచరిస్తూన్నాయీ. తెలంగాణ లోని కరీంనగర్. వరంగల్. ఆదిలాబాద్. ఖమ్మంలో రెండు ..మూడు దళాలు గా కార్యకలాపాలు సాగిస్తున్న యీ.2014 లో టిఆర్ఎస్ ఎన్నికల్లో మావోయిస్టులకు సానుకూలంగా మాట్లాడినవారే అధికారంలోకి వచ్చారు.అటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి మావోయిస్టులు పరోక్షంగా మద్దతు పలికారు.చాలా గ్రామాల్లో టార్గెట్లు ముద్ర పడ్డ వారిని సైతం నక్సల్స్ వదిలిపెట్టిన సందర్భలు ఎన్నో ఉన్నాయి. ఒక దశలో గ్రామాల్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.తెలంగాణ రాష్ట్రంలో లీగల్ అవకాశాల కోసం విప్లవ అభిమానులు ఎంతో ఆశపడ్డారు.టీఆరెస్ అధినేత కెసిఆర్ తన ఎన్నికల ప్రచారంలో పౌరహక్కుల సంఘానికి నాయకునిగా ఉంటానని ఊరించిన విషయం తెలిసిందే. అలా తెలంగాణ లో లీగల్ అవకాశం రాక పొగ హక్కుల సంఘాల పైన ఒత్తిడి పెంచేందుకు సభలను అడ్డుకున్నారు.

ఖమ్మం,వరంగల్, ఆదిలాబాద్ లలో ఎన్ కౌంటర్ల కు ప్రతీకారంగా అధికార పక్షం నాయకులకు వ్యతిరేకంగా ప్రకటనలు విడుదల చేసిన నక్సలైట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టులు దాడులకు తెగబడటo అందరికీ సందేహం కలుగుతోంది. మైదానంలో ఎలాంటి కదలిక లేని మావోయిస్టులు దాడులకు పాల్పడే అవకాశం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాలుగున్నర ఏళ్ల పాటు గ్రామాల్లో పర్యటించి అంతేకాకుండా ముందస్తుకు వెళ్లారు.సాధారణంగా తమ వాళ్ళను కోల్పోయిన సమయంలో మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తుంటారు.అవకాశం కోసం ఎదిరిచూస్తూ దెబ్బతిస్తున్న మావోయిస్టులు అరకులోయ ఎమ్మెల్యే,మాజీలను హత్యలకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పక్షం నాయకుల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సమయంలో చివరి గ్రామాల్లో పర్యటించవలసిన అవసరం ఉంది. మారుమూల ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను ఆనుకొనిఉన్న మరింత అప్రమత్తంగా ఉండాలని అరకు ఎమ్మెల్యే హత్యే ఉదాహరణకు నిలుస్తోంది. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే లపై న పేలిన తూటాలతో తెలంగాణ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేశారు.