అరకు ఎమ్మెల్యే హత్య పై చంద్రబాబు దిగ్భ్రాంతి.

అమరావతి.
అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వర రావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ ను కాల్చి చంపడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎంకు దాడి గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రమకు గురయ్యారు. జరిగిన దారుణం గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.అరకు ఏజెన్సీలో మావోయిస్టుల దాడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను సీఎం చంద్రబాబు కొనియాడారు. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు.
దాడులు,హత్యలు మానవత్వానికే మచ్చ అని సీఎం అన్నారు.ప్రజాస్వామ్య వాదులు అందరూ ఈ దాడిని ఖండించాలని కోరారు.