అవయవదానానికి చంద్రబాబు సిద్ధం.

అమరావతి:
అసాధ్యాలను సుసాధ్యం చేయడంపై యువత దృష్టిసారించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పునరుద్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యంకాదన్న స్థాయి నుంచి చౌక ధరకు కాలుష్యరహిత ఇంధనం ఇచ్చే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన గుర్తుచేశారు. కాలుష్యరహిత ఇంధనానికి ఆంధ్రప్రదేశ్‌ నెలవు కావాలని సీఎం ఆకాంక్షించారు. హైఎనర్జీ బెనిఫిటి స్టోరేజీ బ్యాటరీని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం అవయవదాన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకొచ్చారు.