అస్సాం నిజాలు నిర్ధారించండి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ తిరుగుబాటు నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలను కలుసుకొన్నారు. అస్సాం ఎన్ఆర్సీ వాస్తవాలను పరిశీలించేందుకు బీజేపీ సీనియర్ నేతలతో కూడిన నిజనిర్ధారణ బృందాన్ని అస్సాం పంపించాలని కోరారు. తమ పొరుగు రాష్ట్రమైన అస్సాంలో ఏం జరిగినా అది తమను కూడా ప్రభావితం చేస్తుందని వారికి వివరించారు. అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్లకు సహాయం చేయడం తమ ధర్మమని తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ కూడా పాల్గొన్నారు.