ఆకాశ దేశాన మిమిక్రి దిగ్గజం.

వరంగల్:
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ వేణుమాధవ్(85) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రసంశలు అందుకున్నారు.