ఆత్మహత్య చేసుకున్న రైతుల్లొ బీసీ లే ఎక్కువ. -ఉత్తమ్.

హైదరాబాద్:
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
బీసీ అఖిలపక్ష డిమాండ్స్ నెరవేర్చే పోరాటానికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందన్నారు. టిఆర్ఏస్ ఈ అయిదు సం..25 వేల కోట్లు ఖర్చుపెడతామని మ్యాని ఫెస్టోలో చెప్పారు.. ఇప్పటి వరకు బీసీ లకోసం 8 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదన్నారు.
ఫీజురీయంబర్స్ మెంట్ నిధులువిడుదల చేయకపోవడంతో బీసీ విధ్యార్ధులు చదువుకు దూరం అవుతున్నారు.. చదువు కున్న విధ్యార్ధులు నిరుద్యోగానికి గురవుతున్నారని విమర్శించారు. తెలంగాణ లో ఆత్మహత్య చేసుకున్నరైతులలో ఏక్కువ మంది బీసీ లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న బీసీ విధ్యార్ది కుటుంబం ను పరామర్శించడానికి పోతే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసారన్నారు. బీసీ వర్గీకరణ కింద బీసీ రిజర్వేషన్లు ఏంధుకు పెంచడంలేదని అన్నారు. బీసీ సబ్ ప్లాన్ కింద నిధులు ఏందుకు కేటాయించలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్దానిక సంస్దలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని ఉత్తమ్ తెలిపారు.