ఆనర్ దసరా సేల్ : లేటెస్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్!

న్యూఢిల్లీ:
వచ్చే వారం నుంచి దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ పండుగ సీజన్ లో అనేక బ్రాండ్లు తమ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. చైనాకి చెందిన మొబైల్ పరికరాల తయారీ సంస్థ హువావీ కూడా తన ఆనర్ ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ ప్రత్యేక అమ్మకాలకు ఆనర్ దసరా సేల్ అని పేరు పెట్టింది. ఈ సేల్ లో కంపెనీ కొన్ని ఉత్పత్తులను కేవలం ఒక్క రూపాయికి అమ్మడంతో పాటు వినియోగదారులకు కొన్ని కూపన్లు ఇవ్వనుంది. వీటితో బెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లు పొందే అవకాశం కలుగుతుంది. ఆనర్ దసరా సేల్ అక్టోబర్ 10-15 వరకు జరగనుంది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు కొన్ని కూపన్లు, ఆఫర్లు అందిస్తున్నారు. ఈ సేల్ లో వినియోగదారులు కేవలం ఒక్క రూపాయితో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రూ.20,000 షాపింగ్ చేసిన వారికి రూ.1,000 విలువైన కూపన్ లభిస్తుంది. రూ.10,000 కొనుగోలు చేసిన వారికి రూ.500 కూపన్ అందిస్తోంది ఆనర్. రూ.5,000 కొనుగోలుపై రూ. 300 కూపన్ లభించనుంది. ఈ సేల్ సందర్భంగా ఆనర్ 7ఎస్ పై రూ.2,500 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అక్టోబర్ 11న ఫోన్ కొన్నవారికి రూ.6,499 వెలకే లభించనుంది. దీంతో పాటు ఇచ్చే కూపన్ తో వినియోగదారులు రూ.300 షాపింగ్ చేయవచ్చు. ఆనర్ 7ఏ మీద రూ.3,000 అదనపు డిస్కౌంట్ అందజేస్తున్నారు. ఈ ఫోన్ అక్టోబర్ 11న రూ.7,999కే లభ్యమవుతుంది. కూపన్ ద్వారా రూ.300 అదనపు రాయితీ అందుకోవచ్చు.

ఆనర్ 9ఎన్ రెండు వేరియంట్లపై రూ.4,000 భారీ డిస్కౌంట్ ని కంపెనీ అందిస్తోంది. 11 అక్టోబర్ న ఈ ఫోన్లని కేవలం రూ.11,999, రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు. రూ.500 అదనపు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆనర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ పై కంపెనీ రూ.4,000 ప్రత్యేక రాయితీ అందజేస్తోంది. అక్టోబర్ 11న ఈ ఫోన్ ని రూ.9,999కి కొనుక్కోవచ్చు. వీటితో పాటు ఆనర్ ప్లే, ఆనర్ 7సి ఫోన్లను కూడా కంపెనీ ఈ దసరా సేల్ లో పెట్టింది. కానీ వీటిపై ఎంత డిస్కౌంట్ ఇవ్వనుందీ అధికారికంగా ప్రకటించలేదు.