ఆపద్ధర్మ ప్రభుత్వాలకు గైడ్ లైన్స్: కేంద్ర ఎన్నికల సంఘం.

న్యూఢిల్లీ:

రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీని రద్దు చేసిన తరువాత, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు రద్దు చేసిన తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని తేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం.1994 సుప్రీంకోర్టు పరిశీలన ఆధారంగా ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఏవీ కూడా పథకాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని తేల్చిన ఎన్నికల సంఘం.అసెంబ్లీ, పార్లమెంటు రద్దు తరువాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని పార్ట్ 7 ప్రకారం నూతన పథకాలు, ప్రాజెక్టులు సహా ఏ ఇతర కార్యక్రమాలను ప్రారంభించకూడదని ఆదేశం.
తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యం లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు.అర్ధాంతరంగా ప్రభుత్వం రద్దైతే మోడల్ కోడ్ అమల్లోకి వస్తుందని, కొత్త ప్రభత్వం ఏర్పడే వరకు కోడ్ అమల్లో ఉంటుందని స్పష్టీకరణ.కోడ్ ప్రకారం పాలసీ పరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పథకాలు అమలుచేయకూడదు.అధికార వనరులను అనధికార వ్యవహారాల కోసం ఉపయోగించరాదు.