ఆయేషా! ఆయేషా!! నీ రికార్డులన్నీ మాయమైన సంగతి నీకు తెలుసా?

విజయవాడ:

అయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని హైకోర్టుకు ‘ సిట్’ తెలిపింది.హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ పేర్కొంది.రికార్డుల ధ్వంసంపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.పోలీసు విచారణ కంటే సీబీఐ దర్యాప్తు మేలని హైకోర్టు అభిప్రాయపడింది.సీబీఐని సుమోటో ప్రతివాదిగా హైకోర్టు చేర్చడం మరొక మలుపు