ఆరోపణలు బుుజువు చేస్తే ప్రాణత్యాగం. అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా!

హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా. నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివ్రుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన బోయిని సంధ్య, బోయిని విజేత (అక్కాచెల్లెళ్లు) సంధ్య నన్ను ఎక్స్ ప్లయిట్ చేయాలనే ఆలోచనతో తన సోదరితో కలిసి నా భార్య, కుమారుడితో దిగిన ఫోటోలో భార్య స్ధానంలో తన ఫోటోను మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి తన భార్య మాదిరిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నించింది. తద్వారా నాకు మేసేజ్ ల ద్వారా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. ఈ విషయంపై మంచిర్యాల పోలీసు స్టేషన్లో తేదీ 27.01.2018 రోజున నా సిబ్బంది ద్వారా ఫిర్యాదు చేయడంతో క్రైమ్ నేం.42/18 ద్వారా 420, 419, 506 రేడ్విత్ 34 ఐపీసీ సేక్షన్ల ద్వారా 56 ఐటీీ యాక్ట్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో సంధ్య, విజేత లు ఎంపీ గారిని బ్లాక్ మేయిల్ చేసి డబ్బులు గుంజి తమ జీవితం సెటిల్ చేసుకునేందుకు ఫోటోలు మార్ఫింగ్ చేసినట్లు అంగీకరించగా, సరైన ఆధారాలు సేకరించి ఇద్దరిని ఫిబ్రవరి 6వ తేదీన పోలీసులు అరేస్టు చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది.
ఈ మధ్య కాలంలో తిరిగి అక్కా చెల్లెళ్లు మేసేజ్ ల ద్వారా బ్లాక్ మేయిల్ చేయడం ప్రారంభించారు. నా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి, నామీద బురదజల్లే ప్రయత్నం చేశారు.
ఈ విషయంపై బంజారాహీల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరిపై 448, 506 సేక్షన్ల ద్వారా కేసు నమోదు చేయడం జరిగింది.
మహిళలపై గౌరవ మర్యాదలతో మధ్య తరగతి వారిని బజారుకు ఈడ్చవద్దనే ఆలోచనతో సదరు మహిళలపై ఇప్పటి వరకు నేను ఎలాంటి కాంమేంట్స్ చేయడం జరగలేదు. అయినా కూడా ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేందుకు దళిత ఎంపీనైన తనపై బురదజల్లేందుకు చేస్తున్న ప్రచారాలను మానసిక దాడిగా పరిగణిస్తున్నా..
తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలతో బుుజువు చేస్తే లోయర్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకొని, నేను ప్రాణత్యాగానికి సిద్దం..

మీ.. బాల్క సుమన్ ,
ఎం.పీ,
పెద్దపల్లి.