ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం పై ముఖ్యమంత్రి చేస్తున్న బెదిరింపు వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి.

హైదరాబాద్: 
ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం పై ముఖ్యమంత్రి చేస్తున్న బెదిరింపు వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎం.పి.పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
కేసీఆర్  ఆర్టీసీ సమ్మె చేస్తే ఆర్టీసీకి ఇదే ఆఖరి సమ్మె అంటే బ్లాక్క్మెయిల్ చేసి భయ పెట్టి సమ్మెను మానిపించాలని చూస్తున్నారు అని అన్నారు.అశ్వత్థామ రెడ్డికి లేదా సంస్థ అధ్యక్షుడు హరీష్ రావు కు స్వార్ధం ఏం ఉందొ కేసీఆర్  చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయము లో 10 ఇయర్స్ సమ్మె లేకుండా ఆర్టీసీ నడిపామని, చేతకాని పక్షాన తమ సలహా తీసుకోవాలని పొన్నం చెప్పారు. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల సమయంలో హోటల్ మఱియట్ లో ఆర్టీసీ పై  వరాల జల్లు కురిపించావో చూసుకోవాలని అన్నారు.తెలంగాణ పోరాటం లో ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమ్మె ప్రభావం ఎంతో మరిచావ? అమరవీరుల సంఖ్య ను తగ్గించిన కేసీఆర్..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిన నీకు ఆర్టీసీ హామీలు మర్చిపోతే కొత్త ఏముంది? ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టక వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆర్టీసీ కార్మికుల కు ఏమన్నా నష్టం చేయాలని చూసినా, పట్టుదలకు పోయి నియంతలాగా చేస్తే జాగ్రత్త! అని హెచ్చరించారు.
TMU అండ్ ఆర్టీసీ JAC కలిసి పేద ప్రజల లైఫ్ లైన్ రోజు కోటి మంది ప్రయాణం చేసే ఆర్టీసీ ని కాపాడుకోవాలని ప్రభ్యత్వం సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తూన్న ట్టు తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు 1. ఒక రిటైర్డ్ ED ని MD చేయడం.  2 .ప్రైవేటు బస్ లను అరికట్టక పోవడము. 3 .ప్రభుత్వ రాయితీలు ఆర్టీసీ సంస్థ కు ఇవ్వక పోవడము. 4. ప్రభుత్వం ఉద్దేశ్యంతో ఆర్టీసీ ని నిర్లక్ష్యం చేయడము.5. గౌరవ అధ్యక్షునిగా హరీష్ రావు వుండడం. ప్రభ్యత్వం అన్ని చర్యలు చేపట్టి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని  పొన్నం ప్రభాకర్ కోరారు.