ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర చెస్తే బస్ టైర్ కింద కారు తుక్కు.

కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నల్లగొండ:
ఆర్టీసీ ని ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తే బస్సు టైర్ కింద పడి ‘కారు’ తుక్కు తుక్కు అవుతుందని మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.  నల్గొండ మెడికల్ కాలేజ్ తన కృషెనని చెప్పారు. తనకు క్రెడిట్ రావద్దని సుర్యాపెటలో మెడికల్ కాలేజ్ ని మంజూరు చేశారన్నారు. నల్లగొండ కాలేజ్ కి 200కొట్లు ఇచ్చి సీద్దిపెట్ కు 750 కోట్లు ఇచ్చారని విమర్శించారు.
సీద్దిపెట్, కరీంనగర్ ప్రాంతంలో సాగునీటి పథకాల యాక్షిడెంట్ లలో చనిపోతే 5లక్షలు ఇచారని, నల్లగొండ ఎడమ కాలువలో పడిచనిపొతె 2లక్షలె  ఇస్టారా..? అని ప్రశ్నించారు.సిద్దిపెట్, సిరిసిల్ల అభివృద్దికె కేసీఆర్  ప్రాదన్యం ఇస్తున్నట్టు ఆరోపించారు. కాళేశ్వరం కాకుండా మిగతా ప్రాజెక్ట్ లను పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరంతొ పోల్చితే బ్రాహ్మణవెల్లం కేవలం 10% పనులే పెండింగ్ ఉన్నయని కోమటిరెడ్డి అన్నారు. నల్లగొండలొ టీఆరెస్ బలహీనంగా ఉందన్నారు. తనమీద కోపంతొ బ్రాహ్మణవెల్లం నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. తన ధైర్యం దెబ్బతీసేలా బొద్దుపల్లి మర్డర్, తన సభ్యత్వ రద్దు కుట్ర అని ఆరోపించారు. ప్రభుత్వ వెబ్ సైట్ లొ ఇంకా మాజీ ఎమ్మెల్యే అని చూపిస్తుందని చెప్పారు. సింగల్ బెంచ్, డబుల్ బెంచ్ తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టుగా కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హైకొర్టులొ కంటెంప్ట్ ఆఫ్ కొర్టు కేసు వేస్తానన్నారు. రౌడీలు, లంగలకు రైతుబంధు చెక్కులను పంపిణీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ పాపాలు రాస్థ్రానికి శాపాలని విమర్శించారు. షా దీ ముబారక్, కల్యాణలక్ష్మి ఐకెపీ లకు చెల్లింపులు లేవన్నారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచాలని బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి సమ్మెకు పూర్థి మద్దతును వెంకటరెడ్డి ప్రకటించారు.