ఆర్టీసీ లో సమ్మెకు సన్నాహాలు.

హైదరాబాద్:
ఈ నెల 11 వ తేదీ నుంచి TSRTC లో జరగనున్న ప్రతిపాదిత సమ్మె కు,కార్మిక ప్రయోజనాల దృష్ట్యా NMU మద్దతు ఇవ్వాలని నేటి రాష్ట్ర కమిటీ లో తీర్మానం జరిగింది.NMU రాష్గ్ర కమిటి పిలుపు మేరకు  సమ్మెకు సన్నాహకంగా గురువారం ఉదయం మొదటి సర్వీస్ నుండి “ఎర్ర బాడ్జీలు ” పెట్టాలని నిర్ణయించారు. సమ్మె సన్నాహకంలో భాగంగా రేపు అన్ని డిపోల చెందిన కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించాలని అన్ని యూనియన్ల నేతలు పిలుపు నిచ్చారు.