ఆర్టీసీ సమ్మె విరమణ.

హైదరాబాద్:
హైదరాబాద్:
టీ కప్పులో తుఫానుగా ఆర్టీసీ సమ్మె.
సమ్మె విరమించిన టీఎంయూ.
16% ఐఆర్ కు సర్కార్ ఓకే.
అధ్యయన కమిటీ తో సంస్థ బలోపేతం.
సకల జనుల సమ్మె కాలం నగదు వేతనం.
కార్మికుల పక్షపాతి కేసీఆర్ : కేటీఆర్.
మంత్రుల నివాస ప్రాంగణంలోని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల నివాసం లో ఆర్టీసీ సమ్మె పై టీఎంయూ నేతలతో కలిసి మంత్రులు
కేటియార్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండి రమణారావు, టీఎంయూ నేతలు అశ్వత్థామ రెడ్డి, థామస్ రెడ్డీ, తిరుపతి మీడియా తో మాట్లాడారు.’పేదలు,పిల్లలు,రైతులులను మోసే సంస్థ ఆర్టీసీ. సకల జనుల సమ్మెలో తెలంగాణ వచ్చే వరకు బస్సు పయ్య కదలదు అని నినదించారు ఆర్టీసీ కార్మికులు.తెలంగాణ వచ్చాక ఆర్టీసీ కార్మికులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నరని మొట్టమొదటి సారి 44% ఫిట్ మెంట్ ఇచ్చిన ఘనత సీయం కేసియార్ ది.కార్మికులకు సీయం పై అపారమైన నమ్మకం ఉంది. వాల్లు 25% IR అడిగారు. సీయం గారు గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసారు కాబట్టి వారి సమస్య తెలుసు. సంస్థ ను కాపాడుకోవాలని సీఎం. 16% IR ప్రకటించారు” అని ఈటెల అన్నారు. “సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికి సీయంకేసియార్ 3000 వేల కోట్లు ఇచ్చారు.ఉద్యోగుల డిమాండ్ తో సంస్థకు భారమైనా 16% ఐఆర్ పెంచడం జరుగుతుంది. నెలకు పదహారు కోట్లు..సంవత్సరానికి 200cr భారం అవుతుంది.3 వేల కోట్ల అప్పులతో,
సంవత్సరానికి 700కోట్ల నష్టం ఆర్టీసీ మొస్తూ ఉంది. బడ్జెట్ లో 1000 కోట్లు అందించారు. రాష్ట్రం లో ఆర్టీసీ 97 డిపోలలో రోజు 93 లక్షల మందికి, గ్రేటర్, రంగారెడ్డి జిల్లాలో రోజుకు 38 లక్షల మందికి సేవలందిస్తున్న సంస్థ ఆర్టీసీ. పల్లె వెలుగు వల్ల నష్టం వస్తుంది. మిగతా లాంగ్ టూర్ లో లాభాలు ఉన్నయి.53 వేల మంది కార్మికుల శ్రేయస్సు.ఉద్యోగులను గౌరవించి గతంలో 43% కార్మికులు అడిగితే 44% ఫిట్మెంట్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చారు. సంస్థను బలోపేతం చేసే భాధ్యత మాదే అయితే దీనికి కి అందరు సహకరించాలి” అని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు.”సీయం కేసీఆర్ గారికి ఉన్న గత అనుభవాల దృష్ట్వా సంస్థ ను లాభాల బాటలో ఉంఛేందుకు ఒక కార్యచరణను రూపొందించారు.సీయం కార్మిక పక్షపాతి.ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికి కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం ఏడుగురు మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ వేసారు. ఆర్టీసీ బాగుపడితే ప్రజలు బాగుపడుతరు.
మంత్రి హరీష్ రావు ద్విపాత్రాభినయం చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించారు” అని కేటీఆర్ తెలిపారు.”ప్రభుత్వ రంగ సంస్థ లను కాపాడడంలో ముందుండే వ్యక్తి సీయం కేసియార్.కేంద్రం ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ముస్తుంటే రాష్ట్రం లో సీఎం కేసీఆర్ అందుకే ఇక్కడ జరుగుతున్న పనులకు సంబందించిన పనులను ప్రభుత్వ రంగ సంస్థ లకు ఇచ్చారు.విద్యుత్ పరికరాల భారీ ఉత్పత్తి ని BHEL కు ఇచ్చారు. తెలంగాణ సాదించడంలో ఆర్టీసీది కీలక పాత్ర.రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి మినహాయింపు లు ఇవ్వాలి..ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకుని శాశ్వతంగా నష్టాల నుండి బయటకు వచ్చే విదంగా ఒక కమిటి పని చేస్తుంది.IR ను జులై నుండి ఇస్తాము.సస్పెన్షన్ లపై ఒక కమిటి వేస్తాము.వేదింపులు లేకుండా కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రభుత్వం భాధ్యత. ప్రభుత్వం నుండి సంస్థ బాగుకోసం తీసుకోవాల్సిన చర్యలు తీస్కుంటాము. సకల జనుల సమ్మె కాలానికి సంబందించిన వేతనాన్ని నగదు రూపంలో వెంటనే ఇవ్వాలని సీయం చెప్పారు.రెండు రోజుల్లో కమిటీని నియమించి సీయం కు తెలియజేస్తామని మంత్రి హరీశ్ చెప్పారు. “16%శాతం ఐ ఆర్ ప్రకటించారు.కార్మికులు ఆశించిన రీతిలోనే త్వరలోనే ఫిట్ మెంట్ ఉంటుంది.ఆర్టీసీని‌ ముక్కలు చేస్తామన్నది అంతా అబద్దం…అలాంటిది ఏం లేదని మంత్రుల కమిటీ తేల్చింది.మా తరుపున కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు.సీయం పై నమ్మకంతో సమ్మెను విరమిస్తున్నాము” అని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి తెలిపారు.