ఆర్ధిక సలహాదారు రాజీనామా.

న్యూడిల్లీ ;
కేంద్రప్రభుత్వ ఆర్దికసలహాదారుఅరవింద్‌ సుబ్రమణియన్‌ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఉండేందుకు ఆయన తిరిగి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫేస్‌బుక్‌ లో తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే అరవింద్‌ సుబ్రమణియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడంతో దాన్ని ఆమోదించినట్టు జైట్లీ వ్యాఖ్యానించారు. పలు కీలక ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ చురుకైన పాత్ర పోషించారు. 2014 అక్టోబర్‌లో ప్రధాన ఆర్థిక సలహాదారుగా అరవింద్‌ సుబ్రమణియన్‌ నియమితులయ్యారు. ఆర్థిక సలహాదారు పదవి కేవలం ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం మాత్రమే కాదని కీలక నిర్ణయాల ప్రభావం, పర్యవసానాలనూ అంచనా వేయగలగాలని జైట్లీచెప్పారు.కాగా ఇటీవల అరవింద్ సుబ్రమణియన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశమయ్యారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా రైతాంగం కోసం చేపడుతున్న వినూత్న పధకాలు ఆయననుఆకట్టుకున్నాయి. కెసిఆర్ సృజనాత్మక పాలనా విధానాలను ఆయన ప్రశంసించారు.