ఆలయ ధర్మకర్తల మండళ్ల నియామకానికి నోటిఫికేష‌న్.

హైద‌రాబాద్ :
ప్ర‌ధానఆల‌యాల‌కుధ‌ర్మ‌క‌ర్త‌లమండ‌లినినియ‌మించేందుకు తెలంగాణ‌ ప్ర‌భుత్వంఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిశివ‌శంక‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆసక్తి గలవారుదేవాదాయ శాఖ కమిషనర్, జాయింట్‌ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని శివ‌శంక‌ర్ సూచించారు. గ‌తేడాదినియ‌మించిన ఆయా దేవాదాల‌యాలధ‌ర్మ‌క‌ర్త‌లమండ‌లిప‌ద‌వీ కాలం ముగియ‌డంతోకొత్త‌గానోటిఫికేష‌న్ జారీ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వంనియ‌మంచేప్ర‌సిధ్దపుణ్య‌క్షేత్రాలైన11ఆల‌యాలు, ధార్మిక ప‌రిష‌త్నియ‌మించే 15ఆల‌యాల‌తో పాటు దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్నియ‌మించే122ఆల‌యాల‌కుపాల‌కమండ‌ళ్ల ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేష‌న్ ను జారీ చేసింది.

తాజాగా నోటిఫికేష‌న్ జారీ చేసిన ఆల‌యాలు :

రాష్ట్ర ప్ర‌భుత్వంనియ‌మించేపాల‌కమండ‌ళ్ళు

1. కీస‌ర‌గుట్ట రామ‌లింగేశ్వ‌ర స్వామి, మేడ్చ‌ల్ – మాల్కాజ్ గిరి జిల్లా

2. ద‌ర్వేష్ పురం శ్రీ రేణుక ఎల్ల‌మ్మఆల‌యం, న‌ల్గొండ జిల్లా

3. బ‌ల్కంపేటఎల్ల‌మ్మపోచ‌మ్మఆల‌యం,హైద‌రాబాద్

4. శ్రీ ఉజ్జ‌యినిమహాంకాళీఆల‌యం,సికింద్రాబాద్

5. శ్రీన‌గ‌ర్కాల‌నీ శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం, హైద‌రాబాద్

6. అమీర్ పేట్ శ్రీ క‌న‌క‌దుర్గ ఆల‌యం, హైద‌రాబాద్

7. శ్రీ ఏడుపాయ‌లవ‌నదుర్గభ‌వానీ,నాగ‌సానిప‌ల్లి, మెద‌క్

8. నాచారంగుట్టశ్రీల‌క్ష్మినర్సింహా స్వామి దేవాస్థానం,సిద్దిపేట‌

9. శ్రీ మ‌త్స్య‌గిరిల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యం, వెంక‌ట‌పురం,యాదాద్రి- భువ‌న‌గిరి

10. కుర‌వి శ్రీ వీర‌భ‌ద్ర స్వామి ఆల‌యం,మ‌హ‌బూబాబాద్

11. జ‌మ‌ల‌పురం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం,ఖ‌మ్మం .