ఇంటింటికీ ‘మేఘా’ గ్యాస్.

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో ఇంటింటికీ వంటగ్యాస్‌ను అందించే ప్రాజెక్టును ‘మేఘా ఇంజనీరింగ్’ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 5.5 లక్షల గృహాలకు వంటగ్యాస్ అందనుంది. ఈ మేరకు పెట్రోలియం మరియు సహజవాయు నియంత్రణ మండలి (పీఎన్జీఆర్బీ) కార్యదర్శి వందనశర్మ మేఘా ఇంజనీరింగ్‌కు రాసిన లేఖలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వాణిజ్యపరంగా వంటగ్యాస్ అందించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంలో భాగంగా తాజాగా నిర్వహించిన బిడ్లలో తెలంగాణలోని మూడు బిడ్ల కింద పది జిల్లాలను ఎం.ఈ.ఐ.ఎల్ దక్కించుకుందని మెయిల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (హైడ్రోకార్బన్స్) పి. రాజేష్ రెడ్డి తెలిపారు.. పీఎన్జీఆర్బీ ఇప్పటికి తెరచిన బిడ్లలో వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, నల్గొండ, సూ ర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాలను దక్కించుకోగా, మరికొన్ని బిడ్లు తెరవాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్నాటకలోని తుంకూరు, బెల్గావి జిల్లాల్లో గృహ, పారిశ్రామిక అవసరాలు తీర్చటంతో పాటు వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సిఎన్జి)ని అందిస్తోంది. మేఘా గ్యాస్ ఇట్స్ స్మార్ట్-ఇట్స్ గుడ్’ పేరుతో గ్యాస్ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఇంటింటా గ్యాస్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిడ్డింగ్లో పాల్గొని, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లాలు ఒక యూనిట్గానూ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు మరో యూనిట్గానూ, మూడో యూనిట్ కింద నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాను దక్కించుకుంది.
పది జిల్లాల్లో 3100 కిలోమీటర్ల పైప్ లైను:
ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు 800 ఇంచ్కిలోమీటర్ల గ్యాస్ సరఫరా కోసం ఏర్పాటు చేసే పైప్లైన్లను అంతర్జాతీయంగా ఇంచ్ కిలోమీటర్లలో కొలుస్తారు. ఈ పైప్లైన్లు ఏర్పాటులో గ్యాస్ ఒత్తిడి, వ్యాసం ఆధారం చేసుకుంటారు. దీనిని ఇంచ్ కిలోమీటర్లుగా పరిగణిస్తారు. అదేవిధంగా వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగాం, జయశంకర్ భూపాపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో 800 ఇంచ్ కిలోమీటర్లు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 1500 ఇంచ్కిలో మీటర్ల పైప్‌లైన్ వేయాల్సి ఉంటుంది. మొత్తం పది జిల్లాల్లో 80 ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాపల్లి, జనగాం, మహబూబాబాద్ యూనిట్లోని లక్ష గృహాలకు, ఖమ్మం, కొత్తగూడెం యూనిట్లోని లక్ష ఇళ్లకు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి యూనిట్లోని 3.5 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా జరగనుంది. ఈ ప్రాజెక్టు ఎనిమిదేళ్లలో పూర్తికావాల్సి ఉంది. కేంద్రందేశంలోని 86 ప్రాంతాల్లోని గృహాలకు గ్యాస్ సరఫరా కోసం బిడ్లు ఆహ్వానించగా 400 బిడ్లు వచ్చాయని సహజవాయు నియంత్రణ మండలి వెల్లడించింది.