‘ఇందూరు’ లో టీఆరెస్ కు 9 సీట్లు. – ఎంపీ కవిత.

నిజామాబాద్:

అక్టోబర్ 3న నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. సభ జరిగే గిరిరాజ్ కాలేజీ మైదానంకు వెళ్లారు.మైదానం చదును చేసే పనులను చూశారు. మాజీ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత తదితరులు కవిత వెంట ఉన్నారు. పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులతో సభ ఏర్పాట్లు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సభలు పెట్టడం, భారీగా జనం తరలి రావడం కొత్తేమీ కాదని కవిత అన్నారు. సభకు తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. వారం రోజుల పాటు నిజామాబాద్ ఉంటానని, ఆశీర్వాద సభ సక్సెస్ కోసం ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని తెలిపారు.కేసీఆర్ ను దగ్గరగా చూసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని, ఆయన చెప్పే మాటలు వినాలన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్న దృష్ట్యా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కవిత వివరించారు.మహిళలకు తక్కువ దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, టాయిలెట్లు, అంబులెన్సు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు కవిత తెలిపారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత మళ్లీ నిజామాబాదు లో సభ నిర్వహిస్తుండడం పట్ల ప్రజాప్రతినిధులుగా మాకు సంతోషం గా ఉందని అన్నారు. సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని కవిత తెలిపారు.నిజామాబాద్ జిల్లా సక్సెస్ కు మారుపేరు అని అన్నారు. టిఆర్ఎస్ కు వెన్నెముకగా ఉండే జిల్లా నిజామాబాద్ జిల్లా అన్నారు. ఉద్యమం సమయం నుంచీ నేటి వరకు టిఆర్ఎస్ వెంటే జిల్లా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 100/100 సీట్లు గెలుస్తామన్నారు. అలాగే 9/9 అసెంబ్లీ సీట్లను గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు.

రిజల్ట్స్ తర్వాత రిసౌండింగ్ రిజల్ట్స్ వస్తాయని ఎంపీ కవిత తెలిపారు.ఈ. సి కి సంబంధించిన పనులు, ఈ. డి కి సంబంధించిన పనులు కెసిఆర్ మీద వేస్తే ఎట్లా అని ఎంపీ కవిత ప్రశ్నించారు. కేంద్రం మాకేమైనా సపోర్ట్ చేస్తుందా.. తెలంగాణ ప్రజల కోసం పనులు చేస్తూ ఉందా.. అని అడిగారు వాళ్లది ఏం ఎజెండానో మాకు తెలీదు. బిజెపి- కాంగ్రెస్ కొట్లాట ఏంటో మాకు తెలవదు అని అన్నారు. దండ మెడలో వేసి మీరు సమాధానం చెప్పమంటే ఎలా అని అన్నారు. రేవంత్ రెడ్డి ఇంటిపై జరుగుతున్న దాడులపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుత పరిణామాలకు కేసీఆర్ కు, పార్టీకి సంబంధం లేదని కవిత స్పష్టం చేశారు.