ఇక ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలకు చైర్మన్ లుగా ఐ.ఏ. ఎస్.అధికారులు.

 

హైదరాబాద్:
ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేoదుకు ప్రభుత్వ ఆస్పత్రుల సొసైటీ లకు చైర్మెన్ లు గా ఐఏఎస్ లను నియమిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆస్పత్రి కి కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్, నిలోఫర్ ఆస్పత్రికి రంగారెడ్డి కలెక్టర్, పేట్ల బురుజు ఆస్పత్రి కి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్, సరోజినీ కంటి ఆస్పత్రికి ఫామిలీ వెల్ఫేర్ కమిషనర్, గాంధీ ఆస్పత్రికి హైదరాబాద్ కలెక్టర్ ను, సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి ఐపీఎం డైరెక్టర్, చెస్ట్ ఆస్పత్రికి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ను ఫీవర్ హాస్పిటల్ కు హైదరాబాద్ కలెక్టర్, ఈ.ఎన్. టి. ఆస్పత్రికి ట్రైబల్ వెల్ఫెర్ కమిషనర్, ప్రభుత్వ డెంటల్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సీఈఓ, వరంగల్ ప్రభుత్వ ఆస్పత్రి వరంగల్ కంటి ఆస్పత్రికి, ప్రభుత్వ టీబీ ఆస్పత్రి, హన్మకొండ ప్రసూతి ఆస్పత్రికి జిల్లా కలెక్టర్ లను చైర్మన్లు గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.