ఇక తమిళనాట టి.వి.9. బ్రాన్డ్. టీవీ 9 బ్రాన్డ్ విలువ 400 కోట్లు. తమిళ, ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ టి.వి.9.

ఎస్.కె.జకీర్.
దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ గా గుర్తింపు పొందిన టి.వి. 9 ఇక తమిళనాడులోనూ ప్రవేశిస్తున్నది. టీవీ 9 బ్రాన్డ్ విలువ 400 కోట్లు.ఇప్పటికే తెలుగు, కన్నడ,గుజరాతీ భాషల్లో టి.వి.9 సక్సెస్ ఫుల్ గా ప్రయాణం సాగిస్తున్నది. త్వరలో హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లోనూ టి.వి.9 ఛానల్ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. 14 ఏళ్ల క్రితం అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ అధిపతి శ్రీనిరాజు నెలకొల్పిన టి.వి.9 తెలుగు న్యూస్ ఛానల్ 24 గంటల వార్తా ప్రసారాలలో కొత్త ఒరవడిని, విప్లవాత్మక పంథాను ప్రవేశపెట్టింది. తర్వాత కన్నడ,మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ ఇదే ఫార్ములాతో అప్రతిహతంగా విజయాలను సొంతం చేసుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది..అయితే ఇప్పటివరకు తమిళనాడులో ‘సన్ నెట్ వర్క్’ తో పోటీ పడగలిగిన ఇతర ప్రాంతీయ భాషలకు చెందిన న్యూస్ చానళ్ళు ప్రవేశించలేదు. చాలా కాలం తర్వాత టి.వి.9 తమిళనాడులో కాలుమోపుతోంది. తమిళనాడులో ఇప్పటికే స్థిరపడిన వివిధ న్యూస్ చానళ్లు, వాటి వీక్షకాదరణ, రేటింగ్, లాభనష్టాలు…. ఇతర అన్ని అంశాలపైన టి.వి.9 వ్యవస్థాపక సి.ఐ.ఓ. రవిప్రకాశ్ భారీ హోం వర్క్ చేసిన అనంతరం ఆ రాష్ట్రంలో అడుగిడుతున్నది. టి.వి.9 ఇంగ్లిష్,హిందీ, తమిళ ప్రసారాలకు సంబంధించి బ్రాడ్ కాస్టింగ్ తదితర అనుమతులన్నీ వచ్చాయి. బహుశా జూలై, లేదా ఆగస్టులో ఈ మూడు భాషల్లోనూ టి.వి.9 బ్రాన్డ్ విస్తరించనున్నది.