ఇద్దరు మావోయిస్టుల అరెస్టు. విడుదలకు హక్కుల సంఘాల డిమాండ్!

Hyderabad:

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లో పనిచేస్తున్న కిరణ్ తో పాటు అతని సహచరి మహారాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి ,కేంద్రకమిటి సభ్యురాలు నర్మదక్కని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని తెలంగాణ ప్రజా స్వామిక వేదిక డిమాండ్ చేస్తుంది.”రాజ్యాంగానికి ,చట్టానికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయాలని ప్రజలు, ప్రజా స్వామిక వాదులు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంది.అదుపులోకి తీసుకున్న విప్లవకారులను గతంలో ఎందరినో బూటకపు ఎన్ కౌంటర్ చేసిన వుందంతాలు ఎన్నో వున్న నేపథ్యంలో వీరిద్దరిని కూడా చంపే అవకాశం ఉందని ప్రజా స్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు.ఈ నేపద్యంలో వీరి విడుదల కోసం ప్రజలు, ప్రజా స్వామిక వాదులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, డిమాండ్ చేయాలని ప్రజా స్వామిక వేదిక పిలుపునిస్తుంది”.

– తెలంగాణ ప్రజా స్వామిక వేదిక
కన్వీనర్స్ కమిటీ
ప్రో.హరగోపాల్, ప్రో. PLV , జైని మల్లయ్య గుప్తా, గురిజల రవీందర్, ప్రో. కాత్యాయని విద్మహే, సంధ్య, చిక్కుడు ప్రభాకర్,కోట శ్రీనివాస్, బండి. దుర్గాప్రసాద్