ఇద్దరు యువజర్నలిస్టుల ఆత్మహత్య.

జగదల్ పూర్;
చత్తీస్ గడ్ రాష్ట్రంలోని జగదల్ పూర్ పట్టణంలో ఇద్దరు యువ జర్నలిస్టుల ఆత్మహత్య కలకలం రేపింది. జగదల్ పూర్ కేంద్రంగా వెలువడుతున్న ‘పత్రిక’ అనే దినపత్రికలో పనిచేస్తున్న విలేఖరి రేణు అవస్థి(21), ఐ.ఎన్.ఎస్.అనే న్యూస్ చానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న శైలేంద్ర (34) వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళిద్దరి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు ఘటనలు విడివిడిగా జరిగాయా లేక ఏదైనా బలమైన కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే దిశగా దర్యాప్తు సాగుతున్నది.