ఇప్పుడే తమాషా మొదలైంది.

న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమేథీలో పర్యటించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో జరిపిన సమావేశంలో రాఫెల్ వివాదంలో అసలైన తమాషా ఇప్పుడే మొదలైందంటూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. అవినీతిని అంతమొందిస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ అనిల్ అంబానీకి అప్పనంగా రూ.30,000 కోట్లు అప్పజెప్పారని ఆరోపించారు. ఇది ఆరంభమేనని.. రాబోయే రెండు,మూడు నెలల్లో రాఫెల్, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, పెద్ద నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ టాక్స్ వంటి అనేక అంశాల్లో మోడీ వ్యవహార తీరు ఎండగడతామని హెచ్చరించారు. తమాషా ఇప్పుడే మొదలైందని తెలిపారు. దేశానికి చౌకీదార్ గా ఉంటానన్న నరేంద్ర మోడీ కాపలాదారు కాదనీ, దొంగ అనే విషయాన్ని బట్టబయలు చేస్తానని రాహుల్ అన్నారు.