ఇసుక లారీకి ఒకరి ‘బలి’.

భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో సోమవారం ఇసుక లారీ ఢీ కొనడంతో జాడి మల్లయ్య అనే వ్యక్తి మృతి. నిత్యం ఇక్కడ ఇసుక లారీల వల్ల అనేకమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోతోందని నేడు మరొకరిని ఇసుక లారీ బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇసుక అక్రమ రవాణా వ్యవహారం అంతా ఎమ్మెల్యే పుట్టమధు కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు చూసిచూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.