‘ఈజ్ ఆఫ్ లివింగ్’లో ఏపీ టాప్.

న్యూఢిల్లీ;

ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ఇండెక్స్ 2018 జాబితాలో ఏపీ దేశంలోనే అగ్రస్థానం సాధించింది. ఒడిషా, మధ్యప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సంస్థాగత, సామాజిక, ఆర్థిక, భౌతిక పరిస్థితుల ఆధారంగా 116 నగరాల్లో పరిస్థితులు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ ఈ జాబితాను ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మొదటి మూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలకు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.