ఈటెల కు నిరసన సెగలు!!

కరీంనగర్:

ఈటెల రాజేందర్‌కు ఎన్నికల ప్రచారంలో చుక్కెదురైంది. హుజూరాబాద్‌ లో ప్రచారం ప్రారంభించిన వెంటనే చేదు అనుభవం ఎదురవ్వడంతో ఈటెల రాజేందర్ ఖంగుతిన్నారు. తన ప్రచారంలో భాగంగా డీసీఎంఎస్‌ కాలనీకి వెళ్లిన మంత్రిని “ఇక్కడేం అభివృద్ధి చేశారు. మీరు మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నారం”టూ మహిళలు, స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్‌ కార్యకర్తలు, ఈటెల అనుచరులు స్థానికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోంగా ఈటెల సర్దిచెప్పే యత్నం చేశారు. అయితే ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా ఈటెల అక్కడినుంచి వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయారు. దాంతో స్థానికులు మరింత మండిపడ్డారు. మాకు డబుల్‌ బెడ్రూం ఇళ్లిచ్చారా… ? నీళ్లిచ్చారా…? ఎందుకు వచ్చారని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.