ఈసీ, ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.

న్యూఢిల్లీ:

ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని మే 31న ఈసీ విడుదల చేసిన పాత షెడ్యూల్‌నే కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కేసు విచారణ కొనసాగినంతవరకు కొత్తగా ఓటర్ల సవరణ కోసం ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను నిలుపుదల చేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న సుప్రీంకోర్టు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈసీతోపాటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.