ఈ నెల 10 న కరీంనగర్ లో అమిత్ షా సభ.

హైదరాబాద్:
ఈ నెల 10 న కరీంనగర్ లో ఎన్నికల ప్రచార సభలో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
ఈ నెల 27,28 తేదీల్లో హైదరాబాద్ లో యువమోర్చా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో యువ సమ్మేళనం జరుగుతుందని ఆయన చెప్పారు.దేశ వ్యాప్తంగా bjym మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి యువమోర్చా నేతలు ఈ సమ్మేళనం లో పాల్గొంటారని చెప్పారు.
ర్యాలీ నుద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారని తెలిపారు.మోడీ,ఆడిత్యనాథ్ దాస్, కేంద్ర మంత్రులు వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు.