ఈ నెల 11 నుంచి ఆర్టీసీ సమ్మె: జెఏసి.

హైదరాబాద్:
యాజమాన్యం.. ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 11 వ తేదీ నుంచి సమ్మెకు దిగక తప్పదని ఆర్టీసీ జె ఏ సి నాయకులు రాజిరెడ్డి, హనుమంతు మంగళవారం తెలిపారు. జేఏసీ అవసరం లేదని టిఎం యు.చెప్పడాన్ని నిరసిస్తున్నామని వారన్నారు. ఏకపక్షంగా టీఎంయూ సమ్మె
తేదీని ప్రకటించడాన్ని జేఏసీ తప్పుబడుతుందన్నారు. కార్మికుల విశాల ప్రయోజనాల దృష్ట్య  జేఏసీ టీఎంయూ చేసే సమ్మె కు మద్దతిస్తుందని
చెప్పారు.
టీఎంయూ ఒంటెద్దు పోకడలు పోకుండా కార్మికుల హక్కులను కాపాడాలన్నారు.
ఆర్టీసి పరిరక్షణకోసం 11వ తేదీన మొదటి డ్యుటీ నుండి సమ్మెకు వెళ్తామని ప్రకటించారు.
డిజీల్ పై భారాన్ని తగ్గించాలని, కనీస వేతనం 24వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను యాజమాన్యానికి తాకట్టు పెట్టకుండా పోరాడాలని కోరారు. కార్మికులు 7న ఎర్రబ్యడ్జీలతో నిరసన తెలియజేయాలని కో రారు.8,9,10 లలో సమ్మెపై కార్మికులకు అవగాహనా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.
గుర్తింపుసంఘం ఒంటెద్దుపోకడలకు పోకుండా కార్మికుల హక్కులను కాపాడేలా పోరాడాలన్నారు.టీఎంయూ ప్రకటనకు మద్దతుగా సమ్మెకు వెళ్తామని తెలిపారు. ప్రభుత్వం చొరవతీసుకుని సమ్మెనివారణ చర్యలు చేపట్టాలని కోరారు. బస్సులను పెంచాలని డిమాండ్ చేశారు. సకలజనుల సమ్మె వేతనాలు వెంటనే చెల్లించాలని,
కొత్తబస్సులు కొనుగోలు చేయాలని కోరారు. టీఎంయు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సమ్మెకు కార్మికులు సన్నద్దం కావాలని ఆర్టీసీ జె ఏ సి పిలుపు నిచ్చింది.