ఈ నెల 21 న జయశంకర్ సార్ వర్ధంతి.

హైదరాబాద్:
ఈ నెల 21 న జయశంకర్ వర్ధంతి వేడుకలు తెలంగాణభవన్ లో జరగనున్నాయి. మంత్రి కెటియార్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు
టిఆర్ఎస్ ప్రధాన కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ కోరారు.