ఎంపి కల్వకుంట్ల కవిత ను కలిసిన అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కిరెడ్డి.

అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కిరెడ్డి నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ను కలిశారు. గురువారం హైరాబాద్ లోని ఎంపి నివాసంకు సిక్కిరెడ్డీ కుటుంబ సభ్యులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఎంపి కవిత సిక్కిరెడ్డిని అభినందించారు. అంతర్జాతీయ క్రీడా వేదిక ల్లో బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గా తెలంగాణ కీర్తిపతాకాన్ని ఎగురవేశారు అని ప్రశంసించారు. మోకాలి గాయంతో ఒక దశలో రాకెట్ పట్ట లేని పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో అధిగమించి, ప్రాక్టీస్ ను కొనసాగించిన సిక్కి రెడ్డి క్రీడాకారులందరికీ స్ఫూర్తి గా నిలిచారని ఎంపీ కవిత అన్నారు. భవిష్యత్తులో సిక్కి రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిక్కిరెడ్డికి బతుకమ్మ జ్ఞాపికను ఎంపి కవిత అందజేశారు.