ఎం ఎల్ సి శ్రీనివాసరెడ్డికి ఎం.పి.కవిత పరామర్శ.

హైదరాబాద్:
ఇటీవలే హార్ట్ సర్జరీ చేయించుకున్న ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి ని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. హైదరాబాద్ లకిడికాపూల్ లోని శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన కవిత ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రొటీన్ చెకప్ లో హార్ట్ వాల్వ్ లో మూడు బ్లాకేజెస్ ను డాక్టర్లు గుర్తించారని, స్టార్ హాస్పిటల్ డాక్టర్లు కీ హోల్ సర్జరీ చేశారు అని శ్రీనివాస్ రెడ్డి ఎంపి కవిత కు వివరించారు. త్వరగా రికవరీ అయ్యారని కవిత సంతోషం వ్యక్తం చేశారు.