ఎం.పి.సుమన్ నిరపరాధి. సంధ్య,విజిత బ్లాక్ మెయిలర్లు – మంచిర్యాల పోలీసుల ప్రకటన.

మంచిర్యాల:
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పై వైరల్ అవుతున్న లైంగిక వేదింపుల ఘటన అవాస్తవమని మంచిర్యాల పోలీసులు శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. బాదితులుగా చెప్పుకుంటున్న బోయిని సంద్య , విజిత బ్లాక్ మెయిలర్లనీ చెప్పారు ఆ ఇద్దరిపైన జనవరి 27 న శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా కేసునమోదు చేసినట్టు మంచిర్యాల సి.ఐ మహేష్ తెలిపారు. ఎంపీ ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి లబ్ది పొందాలని ఎంపీ కుటుంబ సభ్యుల పోటోను మార్పింగ్ చేసి ఆన్ లైన్ లో సర్క్యులేట్ చేశారని అయన అన్నారు. హైదరబాద్ బంజారహిల్స్ లోను కేసులు నమోదయ్యాయని మహేష్ చెప్పారు ఇద్దరు నిందితులు సంద్య , విజిత లు పలువురిని బ్లాక్ మేయిల్ చేసి వేదించినట్టుగా తమ విచారణలో తేలిందని సి.ఐ అన్నారు. వీరిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 420 , 292 A , 419 , 506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.